ఉల్లి కొరత లేకుండా చూస్తాం

3

: మంత్రి హరీశ్‌ రావు

హైదరాబాద్‌ ఆగష్టు 23 (జనంసాక్షి):

మార్కెట్లలో ఉల్లి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. రాయితీ ధరపై ఉల్లిని అందరికి అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఉల్లిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు. ఎంత ధరయినా ఉల్లిని కొనుగోలు చేసి రాయితీపై ప్రజలకు అందజేస్తామన్నారు. ఇప్పటి వరకు 15 లక్షల కిలోల ఉల్లిని రైతు బజార్ల ద్వారా ప్రజలకు సరఫరా చేశామన్నారు. ఉల్లిని రాయితీ ధరపై అందించడంతో ప్రభుత్వంపై రూ.3.5 కోట్ల భారం పడిందని వివరించారు.

రాయితీ ధరపై ఉల్లిని సుమారు 7.5 లక్షల కుటుంబాలు కొనుగోలు చేశాయని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 89 కేంద్రాల్లో రాయితీపై ఉల్లి అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. రేషన్‌ కార్డు ఉన్న ప్రతీ కుటుంబానికి రాయితీపై ఉల్లి సరఫరా జరుగుతుందని పేర్కొన్నారు.