ఉస్మానియాను కాపాడాల్సిందే

3

– వైద్యసేవలు మెరుగుపరచాలి

– కూల్చివేతలపై లోతుగా అధ్యయనం చేయాలి

– ప్రొ కోదండారామ్‌

హైదరాబాద్‌ ఆగస్టు 3 (జనరసాక్షి ) : ఉస్మానియా ఆస్పత్రిని కాపాడాల్సిందేనని రోగులకు మెరుగైన వైద్యం అందాలని ప్రొఫిసర్‌ కొదండరాం అభిప్రాయపడ్డారు. ఉస్మానియా ఆస్పత్రి వైద్యులతో సోమవారం నాడు తెలంగాణ జెఎసి నాయకులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో వారంతా భిన్నాభిప్రాయాలు వెల్లడించారు. వైద్య సేవలు మెరుగుపర్చాలని సమావేశంలో అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న ఆస్పత్రికి సవిూపంలోనే కొత్త భవనాన్ని నిర్మిస్తే బాగుంటుందని డాక్లర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. హెరిటేజ్‌ కట్టడాన్ని సంరక్షించాలని డాక్టర్లు డిమాండ్‌ చేశారు. ఆస్పత్రి తరలింపు నేపథ్యంలో తెలంగాణ జెఎసి ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. ఉస్మానియా ఆస్పత్రి భవనం కూల్చివేత విషయంలో లోతుగా అధ్యయనం చేస్తామని డాక్టర్లుకు చెప్పారు. 3 రోజుల్లో మరోసారి ఆస్పత్రిని సందర్శిస్తామన్నారు. పూర్తిస్థాయి అధ్యయనం తర్వాతే జెఎసి ఒక నిర్ణయం తీసుకుంటుందని కోదండరాం స్పష్టం చేశారు.

డాక్టర్ల మధ్య గందరగోళం

ఉస్మానియా వైద్యులతో తెలంగాణ జెఎసి నాయకులు భేటీ అయ్యి.. అభిప్రాయాలు తెలుసుకుంటుండగా.. సమావేశంలో డాక్టర్ల మధ్య కొంత గందరగోళం నెలకొంది. ఆస్పత్రి విశిష్టితను జేఏసీ నాయకులకు డాక్టర్లు వివరిస్తుండగా.. వారిలో వారికే స్పష్టత లేక గందరగోళం నెలకొంది. దీంతో అక్కడున్న జేఏసీ నాయకులు డాక్టర్లను సముదాయించారు.