ఊపిరి పీల్చుకున్న తమిళనాడు
ప్రయాణికుల్లో ఒమైక్రాన్ వైరస్ లేదని నిర్ధారణ
సోషల్ విూడియా పుకార్లను నమ్మొద్దని సూచన
చెన్నై,డిసెంబర్7 ( జనం సాక్షి ) : తమిళనాడు ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. విదేశాల నుంచి వచ్చిన వారిలో ఒమైక్రాన్ లక్షణాలు లేవని నిర్ధారించారు. ఏ ఒక్కరికి కూడా కొత్త వైరస్ లేదని నిర్ధారణ అయ్యింది. దీంతో సోసల్ విూడియా వేదికగా వస్తున్నపుకార్లను నమ్మవద్దని సూచించింది. అలాగే అదేపనిగా పుకార్లు వ్యాప్తి చేయొద్దని కూడా ప్రభుత్వం సూచించింది. దక్షిణాఫ్రికాలో ’ఒమైక్రాన్’ వ్యాప్తి చెందినట్టు వార్తలు వెలువడి నప్పటి నుంచి రాష్ట్రంలోని విమా నాశ్రయాల్లో ఆరోగ్యశాఖ అధికారులు తీవ్ర నిఘా ఏర్పాటు చేశారు. కొత్త వైరస్ వ్యాప్తి చెందుతున్న విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పనిసరిగా కరోనా ముందస్తు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆరోగ్యశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. చెన్నై, కోయంబత్తూరు, మదురై, తిరుచ్చి, తూత్తుకుడి విమానాశ్రయాల వద్ద ఆర్టీపీసీఆర్, రేపిడ్ టెస్ట్ సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో కొత్త రూపు సంతరించుకున్న కరోనా వైరస్ ’ఒమైక్రాన్’ వ్యాప్తి చెందిందంటూ గత నాలుగు రోజులుగా వ్యాపించిన పుకార్లకు తెరపడిరది. విదేశాల నుంచి విమానాల్లో వచ్చిన ఐదుగురికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు, ప్రయోగశాలల్లో కొత్త వైరస్ నిర్దారణ పరీక్షలు జరిపినప్పుడు వారికి ప్రస్తుతమున్న ’డెల్టా’ రకం కరోనా వైరస్ మాత్రమే సోకినట్లు కనుగొన్నారు. దీనితో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఊరట చెందారు. నాలుగు రోజులకు ముందు లండన్ నుంచి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన ప్రయాణికులకు ఆరోగ్యశాఖ అధికారులు పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో తొమ్మిదేళ్ల బాలికకు కరోనా పాజిటివ్ లక్షణాలు బయటపడ్డాయి. అదే విమానంలో ప్రయాణించిన 36 యేళ్ళ మహిళకు కూడా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. వీరిరువురినీ గిండీలోని కింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆస్పత్రికి తరలించి ఐసోలేషన్‌లో ఉంచారు. అదే రోజు సింగపూరు నుంచి విమానంలో తిరుచ్చికి వచ్చిన ప్రయాణికుడికి కూడా పాజిటివ్ వచ్చింది. అతడిని తిరుచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు ఇదేవిధంగా శనివారం లండన్ విమానంలోంచి దిగిన 25 యేళ్ళ యువకుడికి కూడా పాజిటివ్ లక్షణాలు బయటపడటంతో అతడిని కూడా ఆ ఆస్పత్రికి తరలించి ఐసోలేషన్ లో ఉంచారు. ఇక సింగపూరు నుంచి మదురైకి వచ్చిన ఓ ప్రయాణికుడికి కూడా కరోనా వైరస్ సోకినట్టు గుర్తించారు. అతడిని నాగర్‌కోవిల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఐదుగురి రక్తపు నమానా లను సేకరించి ప్రయోగశాలలకు పంపారు. వీరికి ’ఒమైక్రాన్’ వైరస్ సోకిందో లేదో నిర్దారించమంటూ ఆరోగ్య శాఖ అధికారులు ప్రయోగశాలల నిపుణులను ఆదేశించారు. విదేశాల నుంచి వచ్చిన చిన్నారి సహా ఆరుగు రికి పరీక్షలు నిర్వహించినప్పుడు వారికి కొత్త రూపు సంతరించుకున్న ’ఒమైక్రాన్’ సోకలేదని నిర్దారణ అయ్యిందని ప్రకటించారు. గత వారం రోజులుగా రాష్ట్రంలో ’ఒమైక్రాన్’ వైరస్ వ్యాప్తి చెందినట్టు సామాజిక ప్రసార మాధ్యమాల్లో పుకార్లు పుట్టించారని, వాటిని ప్రజలు నమ్మకూడదని హెచ్చరించారు. కొత్త వైరస్ వ్యాప్తిని నిరోధించేదిశగా ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు అప్రమత్తంగా వ్యహరిస్తున్నారని, విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు పరీక్షలు జరుపుతున్నారని తెలిపారు. ప్రస్తుతం ఐదుదురు విమాన ప్రయాణికులకు ’డెల్టా’ వైరస్ మాత్రమే సోకిందని నిర్దారణ కావటంతో వారికి ప్రస్తుతమున్న కరోనా నిరోధక వైద్యచికిత్సలు అందిస్తున్నామని చెప్పారు. విదేశాల నుంచి విమానాల్లో వచ్చే ప్రతి ప్రయాణికుడికి కరోనా ముందస్తు వైద్యపరీక్షలు చేసిన విూదటే బయటకు పంపుతున్నామని చెప్పారు. ’ఒమైక్రాన్’ వైరస్ తాకిడికి గురయ్యేవారి కోసం అన్ని జిల్లా స్థాయి ఆసుపత్రులలో ప్రత్యేక వార్డులను ఆక్సిజన్ సహా అన్ని సదుపాయాలతో సిద్ధం చేశామని తెలిపారు. ఈ కొత్త వైరస్‌ను గురించి ప్రజలు ఆందోళనచెందనవసరం లేదని తెలిపారు.