ఊపిరున్నంత వరకు ప్రజలతోనే..

అ నేడు నోరు విప్పితే రాజకీయాలకు పనికిరాకుండా పోతారు: ఎమ్మెల్యే గంగుల (కరీంనగర్‌)

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రజలతో కలసి ఉద్యమిస్తానని, ఊపిరి ఉన్నంత వరకు వారి మనోభావాలను అనుగుణంగా నడుచుకుంటానన్నా గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. కరీంనగర్‌ కదనభేరిని విజయవంతం చేసినందుకు ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కార్మికులు, మహిళలు, మై నార్టీలు, అన్ని వర్గాల ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కరీంనగర్‌లోని ఆర్‌ ఆండ్‌ బీ గెస్ట్‌హౌస్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ‘నేను తెలుగు దేశాన్ని వీడే ముందు పార్టీ నాయకు పూవర్నీ విమర్శించలేదు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పార్టీ మారుతున్నానని చెప్పాను. కొందరు అవాకులు చవాకులు పేలిస్తే బాధనిపించింది. నేను నోరు విప్పితే రాజకీయాలకు పనికిరాకుండా పోతార’ని కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ హెచ్చరించారు. తాను నోరు విప్పితే ఇంట్లోంచి వారు బయటికి రారని, విమర్శించడం తన లక్ష్యం కాదని.. అవాకులు చెవాకులు పేలితే చరివూతహీనులవుతారని పేర్కొన్నారు. ఐదేళ్ల పాటు సేవ చేసేందుకు ప్రజలు తనను ఎన్నుకున్నారని, వారి ఆకాంక్ష మేరకు తెలంగాణ కోసం పోరాటం చేస్తానని చెప్పారు. రాజీనామా చేయమని ఎవరూ అడగలేదని, అడిగితే అరగంటలో చేస్తానని స్పష్టంచేశారు. ఎవరిపైనా ఒత్తిడి చేసి, తన వెంట రమ్మనలేదని, తెలంగాణ కోసం ప్రేమాభిమానాలతో వచ్చారని, నిజంగా ఒత్తిడి తెచ్చినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు సర్దార్‌ రవీందర్‌ సింగ్‌, యువజన విభాగం అధ్యక్షుడు కట్ల సతీష్‌, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల అశోక్‌, అధికార ప్రతినిధి చీటి రాజేందర్‌రావు, సింగిల్‌విండో చైర్మన్‌ మంద రాజమల్లయ్య , మాజీ ఎంపీటీసీ సుధాకర్‌, మైనార్టీ నాయకుడు  సలీం, తదితరులు పాల్గొన్నారు.