ఊరు – మన బడి పనులు నాణ్యత తో చేపట్టాలి,నాటిన మొక్కలు సంరక్షణ చేయాలి
:జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.
నల్గొండ బ్యూరో. జనం సాక్షి.. మొక్కలు నాటడమే కాక నాటిన మొక్కలు బ్రతికే లా సంరక్షించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు.సోమవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కనగల్,అనుముల మండలం,పెద్ద వూర మండలం లలో పలు గ్రామాలలో విస్తృతంగా పర్యటించి అవెన్యూ ప్లాంటేషన్,పల్లె ప్రకృతి వనం,తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం ల ఏర్పాటు పనులు,మన వూరు మన బడి పనులు పరిశీలన చేసి అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. కనగల్ మండలం ఇస్లాం నగర్ జి.పి.సాగర్ రోడ్డు వెంబడి అవెన్యూ ప్లాంటేషన్ పరిశీలన చేశారు.రహదారి విస్తరణ పనులు జరుగుతున్నందున చూసుకొని మల్టీ లేయర్ ప్లాంటేషన్ మూడు వరుసల మొక్కలు నాటాలని సూచించారు.పూల మొక్కలు నాటాలని,మొక్కలు చుట్టూ పిచ్చి మొక్కలు తొలగించి పాదులు చేయాలని ఆదేశించారు.ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో మన ఊరు మన బడి కార్యక్రమం కింద చేపట్టిన పనులు పరిశీలించారు.పాఠశాలలో చేపట్టిన విద్యుత్,టాయిలెట్ , సం ప్ నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాల ప్రకారం చేపట్టాలని ఆదేశించారు.శేరి లింగోటం జి.పి.లో అవెన్యూ,బ్లాక్ ప్లాంటేషన్,పల్లె ప్రకృతి వనం,బాబా సాహెబ్ గూడెం లో అవెన్యూ ప్లాంటేషన్ పరిశీలించి మొక్కలు చని పోకుండా సర్వైవల్ రేటు ఎక్కువగా ఉండేలా నిత్యం పర్యవేక్షణ చేస్తూ అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అనుముల మండలం లో పులి మామిడి జి.పి.లో అవెన్యూ ప్లాంటేషన్ పరిశీలించారు.మొక్కల చుట్టూ పెరిగిన గడ్డి ని తొలగించాలని సూచించారు.చింత గూడెం జి.పి.లో అవెన్యూ ప్లాంటేషన్,పల్లె ప్రకృతి వనం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.తెలంగాణ క్రీడా ప్రాంగణం ఏర్పాటు పరిశీలించి చుట్టూ మొక్కలు నాటే పనులు పూర్తి చేయాలని అన్నారు.చింత గూడెం జి.పి.లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ను సందర్శించి సమస్యలు తెలుసుకున్నారు.పాఠశాలలో వర్షం వస్తే వర్షం నీరు చేరుకుంటుందని తెలిపారు.పాఠశాల స్థలం కేటాయించిన వేరే చోటికి తరలించడం పై చర్చించారు.పాలెం జి.పి.లో పల్లె ప్రకృతి వనం సందర్శించారు ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో మన ఊరు మన బడి పనులు పరిశీలించారు ఇసుక కొరత వుందని వివరించగా తగు చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. హలియా మున్సిపాలిటీ లో అవెన్యూ ప్లాంటేషన్ పరిశీలించి సూచనలు చేశారు. పెద్ద వూర మండలం నీమా నాయక్ తండా జి.పి.లో పల్లె ప్రకృతి వనం,నర్సరీ పరిశీలించారు తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం ఏర్పాటు పరిశీలించి సూచనలు చేశారు.కలెక్టర్ వెంట తహశీల్దార్ లు,ఎం.పి.డి. ఓ లు,మండల,గ్రామ అధికారులు పాల్గొన్నారు
3 Attachments