ఎందరో మహానుభావుల త్యాగపలమే భారతదేశానికి స్వాతంత్రం

దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం

ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే తెలంగాణ అభివృద్ధి

టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింత ప్రభాకర్

సంగారెడ్డి బ్యూరో,  జనం సాక్షి , ఆగస్టు 15  ::

ఎందరో మహానుభావుల త్యాగపలమే భారతదేశానికి స్వాతంత్రం అని,  దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం అని ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమైందని టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింత ప్రభాకర్ అన్నారు.

77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సంగారెడ్డి పట్టణంలోని చింతా ప్రభాకర్  క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

క్యాంపు కార్యాలయంలో TSHDC చైర్మెన్ చింతా ప్రభాకర్ గారు జాతీయ పతాకాన్ని ఎగురవేశి జాతీయ గీతాన్ని ఆలపించారు.

ఈ సందర్భంగా చింత ప్రభాకర్ మాట్లాడుతూ

ఎందరో మహానుబావుల త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు. నేడు మనమందరం స్వేచ్ఛగా ఊపిరి తీర్చుకుంటున్నామంటే దానికి కారణం ఆ మహనీయుల ఆశీస్సులు అన్నారు. వారందరినీ  స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా స్మరించుకోవడం మనందరి కర్తవ్యం అన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ఎదుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో  అగ్రభాగాన నిలిచిందన్నారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో ఎటు చూసినా పచ్చని పంట పొలాలు, రైతులకు 24 గంటల కరెంటు ఉండడంతో పంటలో నాణ్యత పెరిగి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామన్నారు. ఇదంతా కేసీఆర్ వల్లనే జరిగిందని కొనియాడారు . సీఎం కేసిఆర్ నాయకత్వంలో అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శం అన్నారు .

ఈ కార్యక్రమంలో గ్రంథాలసంస్థ చైర్మన్ నరహరి రెడ్డి ,CDC చైర్మన్ కసాల బుచ్చి రెడ్డి, జెడ్పీటీసీ కొండల్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ మనోహర్ గౌడ్, పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు, కార్యదర్శి నర్సింలు,మందుల వరలక్ష్మి, కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

తాజావార్తలు