ఎందుకు మధ్యవర్తిత్వం వద్దంటున్నారు !

 

కొన్ని సమస్యలు కోర్టు బయటనే పరిష్కరించుకోవడం ద్వారా వివాదాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టవచ్చు. ఉభయులు ఓ అంగీకారానికి రావడం వల్ల ఎన్నో సమస్యలకు పరిష్కారం దక్కగలదు. కానీ అలా జరగడం లేదు. జగన్‌ సిఎం అయ్యాక కెసిఆర్‌తో కలసి సమస్యలను ఉభయులం కలసి పరిష్కరించుకుంటామని అన్నారు. కానీ అలా జరగడం లేదు. ఎందుకనో ఇద్రూ మొండికేసారు. కృష్ణా జలాల వివాద అంశంపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా… న్యాయపరంగా సమస్య పరిష్కారం కోరుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది, భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు తెలిపారు. ఈ క్రమంలో సీజేఐ ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించాలని కేంద్రం కోరగా.. చీఫ్‌ జస్టిస్‌ రమణ అందుకు నిరాకరించారు. కేసును వేరే ధర్మాసనానికి బదిలీ చేస్తూ నిర్ణయం తీసు కున్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వైఖరిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఏపీకి దక్కాల్సిన న్యాయమైన వాటాకు తెలంగాణ గండి కొడుతోందని సర్వోన్నత న్యాయ స్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. మరోవైపు ఇటీవలి జలవివాదాల నేపథ్యంలో తెలంగాణ అధిక నీటిని వాడుకుంటుందని ఎపి ఆరోపించింది. నీటి వాటాలు చెరిసగం అని తెలంగాణ వాదిస్తోంది. ఈ క్రమంలో కేంద్రం గెజిట్‌ విడుదల చేసింది. అదే సమయంఓల వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. ఈ క్రమంలో కలసి పరిష్కరించుకుంటే మంచిదని, అందుకు తాము మధ్యవర్తిత్వం వహిస్తామని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి చెప్పారు. కానీ ఆల జరగరాదని, చట్టబద్దమైన రీతిలో సమస్యపరిస్కారం కావాలని ఎపి కోరుకుంటోంది. జగన్‌ ఎన్నికల్లో గెలిచాక ఇరు రాష్టాల్రముఖ్యమంత్రులూ సత్సంబంధాలే కొనసాగించారు. నదీజజలాల విషయంలో కలసి నడుద్దామని అన్నారు. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులలో నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్‌ ఉత్పత్తి చేయడం ద్వారా కొత్త వివాదం సృష్టించారు కేసీఆర్‌. కృష్ణా నీటిని సగం సగం పంచాలని డిమాండ్‌ చేశారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికతో పాటు రెండున్నర ఏళ్లలో రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ, కాంగ్రెస్‌లను ఇరుకున పెట్టడానికి, కేసీఆర్‌ జల రాజకీయం చేస్తున్నారని విమర్శలు వచ్చాయి. కేవలం సెంటిమెంటు కోసం ఆంధ్ర ప్రభుత్వంతో తగాదా పెట్టుకుంటున్నారన్న భావన కలిగితే కేసీఆర్‌కు అది లాభం చేయకపోవచ్చు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పుడు కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులలో నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్‌ ఉత్పత్తి చేయడం ద్వారా ఏడేళ్లుగా లేని కొత్త వివాదం సృష్టించారు. కృష్ణా నీరు ఏపీ, తెలంగాణ మధ్య ఫిప్టీ, ఫిప్టీ ఉండాలని డిమాండ్‌ చేశారు. కొన్నేళ్ల క్రితం ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీల వాటాలకు అంగీకరించిన తర్వాత ఇప్పుడు ఈ వివాదం తేవడం ఎంతవరకు కరెక్టు? సుదీర్ఘకాలంగా రాజకీయాలలో ఉన్న కేసీఆర్‌ కేవలం తన రాజకీయ అవసరాలకు ఈ డిమాండ్‌ పెట్టారా? తెలంగాణ ప్రయోజనాల కోసమా అన్న చర్చ జరుగుతోంది. రాష్ట్ర విభజన జరిగినప్పుడు జనాభా ప్రాతిపదికన కేటాయింపులు జరిగాయి. ఏపీ జనాభా ఎక్కువ, విస్తీర్ణం అధికం. విద్యుత్‌ విషయంలో మాత్రం హైదరాబాద్‌, ఇతర అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణకు ఎక్కువ కేటాయించారు. నీటి ప్రాజెక్టులలో విద్యుత్‌ ఉత్పత్తికి నిర్దిష్ట ప్రోటోకాల్స్‌ ఉన్నాయి. వాటిని పట్టించు కోకుండా, కృష్ణా యాజమాన్య బోర్డు వద్దన్నా వినకుండా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు. ఇలా చేయడం వెనక ఆంతర్యం ఏమిటన్నది బోధపడడం లేదు. కేవలం రాజకీయ వైరంతో ఇలా చేస్తారని కూడా ఎవరూ భావించడం లేదు. కృష్ణా, గోదావరి నదులకు వరదలు వస్తే ఎక్కువ గ్రామాలు మునిగిపోయేది ఏపీలో అన్న సంగతి కేసీఆర్‌కు తెలియనిది కాదు. వరదలు వచ్చినప్పుడు ఎన్ని వాడు
కున్నా అభ్యంతరం లేదు. అలాగే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మాట్లాడటం అంటే రాయలసీమ లోని కోట్ల మంది ప్రజల దాహార్తిని పట్టించు కోకపోవడమే. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై అభ్యంతరా లుంటే చెప్పడం తప్పు కాదు. ఆ ప్రాజెక్టు ఒక రూపానికే రాకముందు, తెలంగాణలో కొత్త ప్రాజెక్టులు కడతామనీ, విద్యుత్‌ కోసం ఉన్న కాస్త నీటిని వాడేస్తామనీ చెప్పడం ఇరు రాష్టాల్రకు మంచిది కాదు. కేసీఆర్‌ తాత్కాలిక అవసరాల కోసం శాశ్వత ప్రయోజనాలను పణంగా పెడుతున్నారా అన్న విమర్శలు కూడా వచ్చాయి. నిజానికి జగన్‌, కేసీఆర్‌ కూర్చుని పరిష్కరించుకుంటే సమస్య పరిష్కారం కావచ్చు. కానీ అలా జర్కుండా సుప్రీం గడప తొక్కింది. ఎందుకిలా అన్నదానికి సమాధానం లేదు. ఎవరి వాదనలు వారివి. తగాదా రావాలని కొంతమంది కోరుకుంటున్నారు. భవిష్యత్తులో అటువైపు నుంచి మాటలు విూరితే అది రెండు రాష్టా లకు ప్రయోజనకరం కాదు. ఇప్పటికే జగన్‌ ప్రధానికి, కేంద్రమంత్రికి ఫిర్యాదు చేస్తే, తెలంగాణ కూడా ఏపీ స్కీములపై కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఒకప్పుడు ఇద్దరం చర్చించుకుని చేద్దాం అని చెప్పిన కేసీఆర్‌ వైఖరిలో మార్పు కనిపిస్తోంది. రాయలసీమ లిప్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌, రాజోలి బండ వద్ద కాల్వ తవ్వకంపై జగన్‌ ఎంత సీరియస్‌గా ఉన్నారన్నది అర్థం అవుతోంది. జగన్‌ గెలిచాక ఇరు ముఖ్యమంత్రులూ సత్సంబంధాలే కొనసాగిస్తున్నారు. నీటి పథకాల వివాదాలను కూడడా పరిష్కరించుకుంటామని అన్నారు. అయినా నీటి గొడవలు తగ్గలేదు. అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా కేసీఆర్‌ ఏకంగా లక్ష కోట్ల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారు. దీనివల్ల ఎంతోకొం ఆయకట్టు పెరిగింది. భూగర్భ జలాలు పెరిగాయి.
పోలవరం ప్రాజెక్టుపై కూడా తెలంగాణ నేతలకు కొంత అభ్యంతరం ఉంది. శ్రీశైలం డ్యామ్‌ నుంచి వేగంగా తీసుకోవడానికి వీలుగా లిప్ట్‌ ఇరిగేషన్‌ పథకం చేపట్టారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది. ఈ క్రమంలో ఒకదానిపై ఒకటి ఫిర్యాదు చేసుకున్నాయి. కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో అపెక్స్‌ కౌన్సిల్‌ సమా వేశంలో ఈ వివాదాలు ప్రస్తావనకు వచ్చాయి. ఇప్పుడు సుప్రీంలో ఓ ప్రతిపాదన రావడం దానిని ఎపి తిరస్కరించడంతో వివాదం మళ్లీ మొదటికొచ్చింది.