ఎంపీడీవో కార్యాలయంలో అలరించిన బతుకమ్మ సంబరాలు
మిర్యాలగూడ. జనం సాక్షి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు. శుక్రవారం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలోని రైతు వేదికలో ఎంపీపీ నూకల సరళ హనుమంత రెడ్డి, ఎంపీడీవో గార్లపాటి జ్యోతిలక్ష్మి ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికార సిబ్బంది, మహిళా ఉద్యోగనిలు, పెద్ద సంఖ్యలో హాజరై ఆడి పాడారు. మహిళల కేరింతలు కోలాటాల మధ్య సంబురాలు అంగరంగ వైభవంగా సాగాయి. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయ సూపరిండెంట్ కరుణాకర్ రావు, పంచాయతీ రాజ్ ఆదినారాయణ వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు, ఉపాధి హామీ పథకం అధికార, వెలుగు సిబ్బంది, తోపాటు శ్రీనివాస్ నగర్ సర్పంచ్ వెంకటరమణ చౌదరి (బాబి) ఉట్లపల్లి సర్పంచ్ శ్రీనివాస్ కాల్వ పల్లిరాజు ఎలకాని సుజాత రమణ విక్టోరియా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.