ఎంపీలు పార్టీ మారుతున్నందునే తెలంగాణపై కాంగ్రెస్‌

స్పందించింది

-భాజపా అధికార ప్రతినిధి ఎస్‌. రామచంద్రరావు

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌పార్టీ తెలంగాణ ప్రజలతో అటలాడకుండా పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేస్తే భాజపా మద్దతిస్తుందని ఆ పార్టీ పేర్కొంది. కాంగ్రెస్‌ ఎంపీలు పార్టీ మారుతున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల అనంతరం తెలంగాణపై నిర్ణయం తీసుకోనున్నట్లు మీడియాకు సమాచారం ఇవ్వడం ఈ ప్రాంత ప్రజలను మరోసారి మోసం చేయడానికేనని భాజపా అధికార ప్రతినిధి ఎస్‌. రామచంద్రరావు విమర్శించారు. సోమవారం నిజాం కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాధ్‌సింగ్‌ పాల్గొననున్నట్లు ఆయన వివరించారు.