ఎంపీ, ఎమ్మెల్సీ వర్గాల మధ్య తోపులాట
ఆదిలాబాద్ : తాండూరులో ఎంపీ వివేక్ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్ వర్గీయుల మధ్య తోపులాట జరిగి పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది. సహకార సంఘం ఎన్నికల నామినేషన్ల పరిశీలన సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు పరిస్ధితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.