ఎంపీ కీర్తి ఆజాద్ సస్పెన్షన్
– అరుణ్‌జైట్లీపై అవినీతి ఆరోపణలే కారణం
ఢిల్లీ,డిసెంబర్23(జనంసాక్షి): సొంత పార్టీకి చెందిన కేంద్ర ఆర్థికమంత్రిపై బహిరంగంగా వ్యాఖ్యలు చేసి, ట్వీట్ల యుద్ధం ప్రకటించిన తమ ఎంపీ, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ విూద బీజేపీ సస్పెన్షన్ వేటు వేసింది. డీడీసీఏ వ్యవహారంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్ ను బీజేపీ అధిష్టానం సస్పెండ్ చేసింది. క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. ఈ మేరకు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఉత్తర్వులు జారీ చేశారు.సొంత పార్టీ ఎంపీ అయిన కీర్తి ఆజాద్ కూడా ఆరోపణలు చేయడంతో భాజపా ఇరకాటంలో పడింది. దీనిపై భాజపా సీనియర్ నేతలు హెచ్చరించినా ఆయన వెనక్కి తగ్గలేదు. దీంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది.డీడీీసీఏ (ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్) అక్రమాల వ్యవహారంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీపై బీజేపీ ఎంపీ మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ విరుచుకుపడ్డారు. జైట్లీ తనపై కూడా పరువునష్టం దావా వేయాలన్నారు.’హల్లో డియర్ అరుణ్‌జైట్లీ.. నాపై కూడా పరువునష్టం దావా వేస్తున్నావు కదా? ప్లీజ్ నా విూద కూడా వెయ్యి.. మినహాయింపు ఏవిూ వద్దు. భావప్రకటనా స్వేచ్ఛను హరించకు’ అని ట్వీట్ చేశారు. ‘నా పేరు ఎందుకు కేసులో చేర్చలేదు. విూరే కదా నేను రిజిస్టర్ పోస్టులో పంపించిన లేఖలు చూపించింది. నాపై కూడా కేసు పెట్టండి’ అని పేర్కొన్నారు. జైట్లీ ఢిల్లీ క్రికెట్ సంఘం ఛైర్మన్ గా ఉన్న సమయంలో అవకతవకలు జరిగాయంటూ ఆప్ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాంలో జైట్లీపై సొంత పార్టీ ఎంపీ అయిన కీర్తి ఆజాద్ కూడా ఆరోపణలు చేయడంతో బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై బీజేపీ సీనియర్ నేతలు హెచ్చరించినా ఆయన వెనక్కి తగ్గలేదు. కీర్తి ఆజాద్ బీహార్ లోని దర్భాంగ లోక్ సభ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ స్థానం నుండి మూడు సార్లు గెలిచారు. ఆయన తండ్రి భగవత్ ఝూ ఆజాద్ బీహార్ మాజీ సీఎంగా వ్యవహరించారు. క్రికెటర్ గా మంచి పేరున్న ఆజాద్ 1983 ప్రపంచకప్ ను సాధించిన జట్టులో సభ్యుడుగా ఉన్నారు. కాగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీపై ఆరోపణలు చేసినందుకు బీజేపీ తనను సస్పెండ్ చేయడంపై ఎంపీ, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ స్పందించారు. తానేం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేశానని తనను సస్పెండ్ చేశారని బీజేపీ అధినాయకత్వాన్ని ఆయన ప్రశ్నించారు. తనను సస్పెండ్ చేయడం పార్టీకే దురదృష్టం అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. తాను తొమ్మిదేళ్లుగా ఈ అంశాన్ని లేవనెత్తుతున్నానని, గతంలోనే పార్టీ పెద్దలు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో పార్టీదే బాధ్యత అని, తనదేం తప్పు లేదని ఆయన స్పష్టం చేశారు.తొమ్మిదేళ్లుగా తాను ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నాని, తాను ఎవరి గురించి వ్యక్తిగతంగా వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని ఆయన చెప్పారు. నిజాలు మాట్లాడేవారిని బీజేపీ నుంచి గెంటేస్తున్నారని, మున్ముందు ఇంకా ఏం జరుగనుందో వేచి చూడాలని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ క్రికెట్ బోర్డు అవినీతి వ్యవహారంలో అరుణ్‌జైట్లీపై కీర్తి ఆజాద్ బాహాటంగా ఆరోపణలు చేశారు. దీనిపై కన్నెర్ర జేసిన బీజేపీ ఆయనను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా వుండగా కీర్తి ఆజాద్ బిహార్‌లోని దర్భాంగా లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ఈ స్థానం నుంచి మూడుసార్లు గెలుపొందారు.క్రికెటర్‌గా మంచి పేరున్న ఆజాద్ 1983 ప్రపంచకప్‌ను సాధించిన జట్టులో సభ్యుడు.ఆయన తండ్రి భగవత్ ఝా ఆజాద్ బిహార్ మాజీ సీఎంగా వ్యవహరించారు.పలు కారణాల రీత్యా ఆయన కొంతకాలంగా పార్టీ అగ్రనాయకత్వంపై గుర్రుగా వున్నారు.జైట్లీపై లోక్‌సభలో అధికారపక్ష సభ్యునిగా వున్న ఆజాద్ విమర్శలు గుప్పించడంతో పార్టీ నాయకత్వం చివరకు అతన్ని సస్పెండ్ చేసింది.