ఎంపీ కోమటిరెడ్డి ని విమర్శిస్తే సహించేది లేదు
కాంగ్రెస్ నేతల హెచ్చరిక
మిర్యాలగూడ. జనం సాక్షి
తెలంగాణ సాధన కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకొని తెలంగాణ సాధనకై ఆమరణ నిరాహార దీక్ష చేసి సొంత పార్టీ మీదనే ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ సాధనలో ముఖ్య భూమిక పోషించిన కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని విమర్శించటం చాలా సిగ్గుచేటని పట్టణ కాంగ్రెస్ఈ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి. ఎంపీటీసీ ల ఫోరమ్ జిల్లా జనరల్ సెక్రటరీ బెజ్జం సాయి. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తమ్మడబోయిన అర్జున్ లు విమర్శించారు. శనివారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే భాస్కర రావు గారు ఏ రోజు తెలంగాణ సాధన కొరకు ఉద్యమం చేయని నాయకుడు వీరంతా ఏ పార్టీ అధికారం వుంటే ఆ పార్టీలో చేరి ఈ విధంగా మాట్లాడటం సిగ్గుచేన్నారు, తెలంగాణ రాకముందు కాంగ్రెస్ పార్టీ అంతర్గత భూ డ్రైనేజీ వ్యవస్థను మీరు ఇంతవరకు పూర్తి చేయలే, మినిరవీంద్ర భారతి ఇంతవరకు పూర్తి చేయలే, లక్షల కోట్లతోటి తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తున్న మిషన్ భగీరథ నీళ్లు పట్టణ శివారు ప్రాంతాలకు రాలే, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రాలేదని ఆరోపించారు మిర్యాలగూడలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యే భాస్కరరావు ను విమర్శించిన మాటలకు మేము కట్టుబడి ఉన్నాం భాస్కరావు వారి తనయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం కాంట్రాక్టులు చేస్తున్నాడు అన్నమాట నిజం ఎన్ టీవీ ఛానల్ వాళ్లు ఇచ్చిన షాడో ఎమ్మెల్యే ఈరోజు మిర్యాలగూడలో కాంట్రాక్టులు చేయడం లేదా? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం లేదా ? ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే దానిలో ఆలగడప దగ్గర ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నది నిజం కాదా? రైతుల దగ్గర నుండి తక్కువ ధరకు భూములు కొని ప్లాట్లుగా మార్చి ఎక్కువ ధరకు సామాన్యుడు చిన్న ఇల్లు నిర్మించుకోలేని పరిస్థితిని సృష్టించారన్నారు, భాస్కర రావు తెరాసకు వెళ్లిన తర్వాతనే మిర్యాలగూడ నియోజకవర్గంలో సిసి రోడ్లు వేస్తున్నట్టుగా గొప్పలు చెప్పుకుంటున్న నాయకుల్లారా గతంలో మీరు ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సిసి రోడ్లు వేయలేదా మిర్యాలగూడకు ఈరోజు టిఆర్ఎస్ పార్టీలోకి పోగానే గతమంతా మర్చిపోయారా అని ప్రశ్నించారు. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రెచ్చగొడితే తర్వాత జరిగే పరిణామాలకు ఎమ్మెల్యే భాస్కరావు గారు బాధ్యత వహించాల్సి వస్తుంది ఇకపోతే మాజీ ఎమ్మెల్యే విజయసింహారెడ్డి గారు వారు మాట్లాడే మాటలకు మేము ఏమనాలో మాకు అర్థం కాని పరిస్థితి ఉన్నది ఎందుకంటే గతంలో విజయసింహారెడ్డి గారి తండ్రిగారు తర్వాత విజయసింహారెడ్డి గారు ఈ మిర్యాలగూడ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలుగా ఉండి మరి ఆరోజు మీరు అభివృద్ధి చేయలేదా అనే విషయాన్ని ప్రజలకు తెలియజేసిన తర్వాత మీరు ఎమ్మెల్యే భాస్కర రావు గారిని పొగిడితే బాగుంటుందని ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ అనుకుంటున్నారు మీరు టిఆర్ఎస్ పార్టీలోకి పోయి ఇప్పుడు జడ్పిటిసి అయినారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మీ కుటుంబాన్ని ఎమ్మెల్యేలు చేసిన గణత ఈ కాంగ్రెస్ పార్టీ, మీరు ఆ స్థాయి మరిచిపోయి ఈరోజు ఇంత దిగజారుడుగా మాట్లాడటం అట్టి విషయాన్ని మీ విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు . ఈ సమావేశం లో జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ చిలుకూరి బాలు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నాగు నాయక్, మున్సిపల్ కౌన్సిలర్ క్రికెటర్ జానీ, యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సిద్దు నాయక్, మాజీ సర్పంచ్ లింగయ్య, మండల మైనార్టీ అధ్యక్షుడు గౌస్, గాలం వెంకన్న, శంకర్ రెడ్డి, ఇంద్ర కుమార్,. తదితరులు పాల్గొన్నారు.
Attachments area