ఎంపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ

 ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని
. నర్సాపూర్ ,  అక్టోబర్ , 9,  (  జనం సాక్షి  )
 టిఆర్ఎస్ పార్టీ వేస్ట్ పార్టీ అని అందులో ఎవరు ఉండరు అని ఆయన స్పష్టం చేశారు
 తెలంగాణ అమ్రిష్ పురి, మాయల మంత్రికుడు కేసీఆర్ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు.
 ఒక్క రైతు బంధు ప్రజలకు ఇచ్చి మిగతా సబ్సిడీ లోన్ ని బంద్ చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుంది అని విమర్శించారు.
 బ్యాంకు లోన్ లు కట్టని కెసిఆర్ కు  లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన ప్రశ్నించారు.
 కాలేశ్వరం ప్రాజెక్టుకు 30 కోట్లు అని చెప్పి లక్ష్యంపై కోట్లకు పెంచి కమిషన్ నొక్కిన ఘనుడు కెసిఆర్ అని అన్నారు.
 నర్సాపూర్ ప్రాంతంలో ఏ ఒక్క నిరుద్యోగి కూడా ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదని ఆయన విమర్శించారు.
 ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఉన్న బీటీ బ్యాచ్ లక్షల కోట్లు సంపాదిస్తున్నారు అని ఆరోపించారు.
 ముఖ్యమంత్రి కుటుంబ పాలన, గడీల పాలన, దొరల పాలన, కూల్చడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
 ముఖ్యమంత్రి ప్రశ్నించే వారిని జైల్లో పెట్టి పీడీ యాక్ట్ పెడుతున్నారని పీడీ యాక్ట్ లకు బీజేపీ కార్యకర్తలు ఎవరు భయపడవద్దని ఆయన సూచించారు.