ఎంపీ వివేక్‌తో ఎమ్మెల్యే లక్ష్యారెడ్డి భేటీ

హైదరాబాద్‌ : ఎంపీ వివేక్‌తో ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఈరోజు భేటీ అయ్యారు. ఎంపీ వివేక్‌ తెరాసలోకి వెళ్లేందుకు సిద్ధమైన తరుణంలో అయనతో లక్ష్మారెడ్డి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వివేక్‌తో భేటీ అనంతరం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ వివేక్‌ కుటుంబం మొదటి నుంచి కాంగ్రెస్‌ కుటుంబమేనన్నారు. అయనను పార్టీలోనే ఉండాలని సూచించానన్నారు. గల్లీలో, అధికారంలో లేని పార్టీతో తెలంగాణ ఎలా వస్తుందని అయన ప్రశ్నించారు.