ఎంబీబీఎస్‌ నోటిఫికేషన్‌ విడుదల

రాష్ట్రంలోని నాలుగు అన్‌లైన్‌ కేంద్రాల్లో…
ఈ నెల 20 నుంచి 27 వరకు మొదటి విడుత కౌన్సిలింగ్‌
ఎన్టీఅర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం : రాష్ట్రలోని మూడు విశ్వవిద్యాలయాల పరిధిలో ఉన్న మెడికల్‌, డెంటల్‌ కళాశాలల్లో అందుబాటులో ఉన్న సీట్లకు మెదటి విడుత కౌన్సిలింగ్‌  ఈ నెల 20 నుంచి 27 వరకు నిర్వహిస్తున్నట్లు  డాక్టర్‌ ఎన్టీఅర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ టి. వేణుగోపాల్‌ రావు తెలిపారు. ఈ సందర్బంగా నోటిఫికేషన్‌ను గురువారం విడుదల చేసింది. హైదరాబాద్‌లోని జేఎన్‌టియు, విశాఖనట్నం ఆంద్రా యూనివర్సిటి, తిరుపతి ఎస్వీయూ, విజయవాడ డాక్టర్‌ ఎన్టీఅర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయాల్లో ఆన్‌లైన్‌లో కౌన్సిలింగ్‌ చేపడుతారు. ఎంసెట్‌ ర్యాంకు మెరిట్‌ ఆదారంగా ఈనెల 20న 1-900ర్యాంకుల వరకు, 21న 901-2400 ర్యాంకుల వరకు, 22న 2401-5000 ర్యాంకుల వరకు, 23న 5001-7000 ర్యాంకుల వరకు, కౌన్సిలింగ్‌ నిర్వహించి ఆదే రోజు నుంచి బిసి అన్ని కెటగీరిలు, ఎస్సీ, ఎస్‌టీ, అభ్యర్థులకు కౌన్సిలింగ్‌ చేపడుతారు. అభ్యర్థులు ఈ ఏడాది డిసంబర్‌ 31 కల్లా 17 సంవత్సారాలు నిండిన వారు మాత్రమే అర్హులు. అనగా 02-01-1996 తేది తర్వాత పుట్టినవారు కౌన్సిలింగ్‌కు అనర్హులుగా ప్రకటించారు. విద్యార్హతల్లో ఓసి కేటగిరి అభ్యర్థులు ఇంటర్‌ , ఎంసెట్‌లో 50 శాతం (80 మార్కులు ) , బిసి/ఎస్సీ,/ ఎస్‌టీ  కేటగిరి అభ్యర్థులు (64 మార్కులు ), వికలాంగులకు 45 శాతం (72 మార్కులు ), ఉన్న వారికే  కౌన్సిలింగ్‌కు అనుమతిస్తారు. జీవో నంబరు 42 ప్రకారం అన్‌ రిజర్వుడు సీట్లకు కౌన్సిలింగ్‌ చేపట్టిన తర్వాత లోకల్‌ ఏరియా సీట్లకు కౌన్సిలింగ్‌ నిర్వహిస్తారు.  ప్రత్యేక కేటగీరి ఆంగ్లో ఇండియాన్‌ ,స్పోర్ట్స్‌ గేమ్స్‌, ఆర్మీ సంతతి, ఎన్‌సీసీ, వికలాంగులు అభ్యర్థులకు సంబందించి నోటిఫికేషన్‌ తర్వాత ప్రకటిస్తారు. కౌన్సిలింగ్‌ సిట్లు పొందిన అభ్యర్థులు వారి ఎంబీబీఎస్‌ , బీడీఎస్‌ కోర్సులు పూర్తి అయిన తర్వాత తప్పనిసరిగా ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించాలి. భారత వైద్యమండలి నిభందనల ప్రకారం  కౌన్సిలింగ్‌లో సీట్లు పొందిన  అభ్యర్థులు ఆగస్టు ఒకటో తేది నుంచి అయా వైద్య, దంత కళాశాలల్లో తరగతులకు హజరు కావాల్సి ఉంటుంది. ర్యాంకుల వారికి  కౌన్సిలింగ్‌ షెడ్యులు,  కౌన్సిలింగ్‌కు హజరుకావడానికి తీసుకురావల్సిన సర్టీఫికేట్ల వివరాలు, మార్గనిర్థేశకాలు యూనివర్సిటి వెబ్‌సైట్‌ ష్ట్ర్‌్‌జూ://అ్‌తీబష్ట్రర.aజూ.అఱష.ఱఅ పొందుపర్చారు.

కౌన్సిలింగ్‌లో భర్తీ చేసే సీట్లు

ఎంబీబీఎస్‌  కోర్సులో 14  ప్రభుత్వ కళాశాలలో 2050 సీట్లు, 22 ప్రవేటు కళాశాలల్లో 3050 సీట్లుండగా అందులో 1830 సీట్లను కన్వీనర్‌ కోటా కింద హెల్త్‌ భర్తీ చేస్తుంది. అలాగే ఈ ఏడాది ఎంసీఐ అనుమతులొచ్చిన మూడు మైనార్టీ కళాశాలల్లో 400 సీట్లుండగా వాటిని అయా యాజమాన్యాలు భర్తీ చేసుకుంటాయి.                         బీడీఎస్‌ కోర్సుల్లో 3  ప్రభుత్వ కళాశాలలో 180 సీట్లుండగా, 16 ప్రవేటు కళాశాలల్లో 1450 సీట్లుండగా అందులో ఎ, బీ కేటగీరి కింద 870  సీట్లను యూనివర్సీటి భర్తీ చేస్తుంది. అలాగే సికింద్రాబాద్‌ ఆర్మీ దంత కళాశాలల్లో 40 సీట్లలో ఆరు సీట్లను కన్వీనర్‌ కోటా కింద హెల్త్‌ భర్తీ చేస్తుంది