ఎక్కువ పంట దిగుబడి రావడానికి రైతులు నాణ్యమైన విత్తనాలు వాడాలి:ముఖ్య ప్రణాళిఖాధికారి చిన కొట్యాల్
మెదక్ ప్రతినిధి,(జనంసాక్షి):ఎక్కువ పంట దిగుబడి రావడానికి రైతులు నాణ్యమైన విత్తనాలు వాడవలసినదిగా ముఖ్య ప్రణాళిఖాధికారి చిన కొట్యాల్ అన్నారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారుల సూచనలు, సలహాల పాటిస్తూ నెల రకానికనుగుణంగా నాణ్యమైన విత్తనాలు వాడితే పంట దిగుబడి అధికంగా వస్తుందని అన్నారు. పంట కోత ప్రయోగంలో భాగంగా మంగళవారం పాపన్నపేట మండల పరిధిలోని కొంపల్లి గ్రామంలో సత్తయ్య గౌడ్ వారి పొలంలో పంట కోత ప్రయోగం చేసిన ఫలితం ఎలా ఉందొ నేడు పరిశీలించారు. అతని పొలంలో 5 x 5 మీటర్ల పొడవు, వెడల్పులో పంట దిగుబడిని పరిశీలించగా 17.564 కిలోల ధాన్యం తూకం వచ్చిందని అన్నారు. ఇలా ప్రతి మండలంలోని వివిధ గ్రామాలలో వరి ఎక్కువగా వేసిన కొన్ని ప్రాంతాలను ర్యాండంగా ఎంపి