ఎక్సయిజ్ అధికారుల దాడిలో 300 లీటర్ల బెల్లపు పానకం ధ్వసం
15 లీటర్ల గుడుంబా స్వాధీనం
ఎక్సయిజ్ ఎసై రాయబారపు రవి కుమార్
ఖానాపూర్ రూరల్ 30 సెప్టెంబర్ (జనం సాక్షి): గుడుంబా నిరోధానికై ఆదిలాబాద్ జోన్ ఎక్సయిజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి అదేశాలప్రకరం శుక్రవారం నిర్మల్,ఆదిలాబాద్ ఎక్సయిజ్ అధికారులు సంయుక్తంగా ఖానాపూర్ మండలం లో తనిఖీలు నిర్వహించగా సింగపూర్ గ్రామంలోని బొజ్జ భారతి నిషేధిత గుడుంబా అమ్ముతుండగా అరెస్ట్ చేసి ఆమె డేగరా ఉన్న ఐదు లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నట్లు భారతి ని ఖానాపూర్ తహసీల్దార్ ముందు హాజరు పరిచి బైండోవర్ చేసినట్లు ఎక్సయిజ్ ఎసై రాయబారపు రవి కుమార్ తెలిపారు.అలాగే సింగపూర్ తండాలో జరిపిన తనిఖీల్లో గూగులవత్ అమర్ సింగ్ కు చెందిన ఐదు లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకోగా పరారీలో ఉన్న అమర్ సింగ్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.అనంతరం రాజురా తండా చందు నాయక్ తండాలో నిషేధిత గుడుంబా అమ్ముతున్న గూగులవత్ విశాల్ ఇంటి ముందు ఐదు లీటర్ల గుడుంబా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని పరారీలో ఉన్న విశాల్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే రాజురా తండా శివారులో ఉన్న సుమారు 300 లీటర్ల బెల్లపు పానకాన్ని కనుగొని వాటిని నేర స్థలాల వద్ద నే ధ్వంసం చేశారు.ఈ తనిఖీల్లో ఎక్సయిజ్ ఎసై సుందల్ సింగ్,సిబ్బంది రాజశేఖర్, కమలాకర్,ఇర్ఫాన్,మధు,గౌతమ్,నిరోశ,వినిషా లు పాల్గొన్నారు.