ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఆఫీస్‌లో సైకో హల్‌చల్
కరీంనగర్, ఏప్రిల్ 6: జిల్లాలని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఓ సైకో హల్‌చల్ సృష్టించాడు. కమిషనర్ కార్యాలయం ముందు పార్క్ చేసిన ఓ బైక్‌ను తగలబెట్టాడు. అనంతరం కార్యాలయంలోకి చొరబడి ఫర్నీచర్ ధ్వంసం చేశాడు. అప్రమత్తమైన పోలీసులు ఆ సైకోను అదుపులోకి తీసుకున్నారు.