ఎట్టకేలకు విజయ్‌కు ఆహ్వానం

` నేడు తమిళనాడు సీఎంగా ప్రమాణం
చెన్నై(జనంసాక్షి):అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కీలక మలుపులు తిరిగిన తమిళనాడు రాజకీయాల్లో అనిశ్చితి వీడుతోంది. అత్యధిక స్థానాలు గెలిచిన విజయ్ నేతృత్వంలోని టీవీకేకు కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయÖఎంఎల్ మద్దతు తెలపడంతో ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ లైన్ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది.శనివారం గవర్నర్‌ను కలిసి తమకు మద్దతిచ్చిన పార్టీల లేఖలను అందజేసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. మెజార్టీ మార్క్ (118)కు చేరుకోవడంతో గవర్నర్ సమ్మతించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు టీవీకే చీఫ్ విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై లోక్‌భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.ప్రభుత్వ ఏర్పాటులో టీవీకేకు మద్దతు ఇస్తోన్న వీసీకే.. క్యాబినెట్ బెర్త్‌లు మాత్రం వద్దని చెప్పింది. “మేం ప్రభుత్వంలో చేరబోం. వెలుపలి నుంచే మద్దతు ఇస్తాం. భవిష్యత్‌లో ప్రభుత్వంలో భాగం అవుతామా లేదా..? అన్నది చెప్పలేం. రాష్ట్రపతి పాలనను నివారించేందుకు, ప్రజల తీర్పును నెరవేరేలా చేసేందుకు ప్రభుత్వ ఏర్పాటులో భాగం అవుతున్నాం” అని వీసీకే చీఫ్ తిరుమావళవన్ విÖడియాకు వెల్లడించారు. తాము ఇప్పటికీ డీఎంకే నేతృత్వంలోని కూటమిలోనే ఉన్నామని వీసీకే, ఐయÖఎంఎల్ వెల్లడించడం గమనార్హం. ఇప్పటికే వామపక్షాలు కూడా క్యాబినెట్ పదవులు వద్దని చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో చెన్నై సవిÖపంలో టీవీకే ఎమ్మెల్యేలు ఉంటున్న రిసార్ట్ బయట భద్రతను భారీగా పెంచారు.
పార్టీల వారీగా సంఖ్యాబలం ఇలా..
టీవీకే : 107
కాంగ్రెస్ : 5
సీపీఐ : 2
సీపీఎం : 2
వీసీకే : 2
ఐయÖఎంఎల్`2