ఎడమ కాల్వ నీటి విడుదల చేయాలని సీరైతు సంఘం వినతి

మిర్యాలగూడ. జనం సాక్షి
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మిర్యాలగూడ ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ ఎడమ కాలువ నీటి విడుదల చేయాలని ఆర్డీవో కార్యాలయంలో సూపర్డెంట్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘంజిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బంటు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కృష్ణా జలాలు కు గత పది పదిహేను రోజుల నుండి ఎగువ ప్రాంతంలో వర్షాలు కురవటం వలన శ్రీశైలానికి నీరు వచ్చి నిండుకుండలా మారింది నాగార్జునసాగర్ కు విద్యుత్తు ద్వారా నీటి విడుదల చేస్తున్నారు పైనుంచి వచ్చే వరదలు అదే విధంగా కొనసాగితే వారం పది రోజుల్లో నాగార్జునసాగర్ కూడా నుండే అవకాశాలు ఉన్నాయి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం తమరి ద్వారా కోరినది నాగార్జునసాగర్ ఎడమ కాలువ నీటి విడుదల తేదీని ప్రకటించాలని కోరుతున్నాను. రైతులు నారు పోసుకునుటకు వెనక ముందు ఆడుతున్నారు రైతులు 10 కేజీల వరి విత్తనాలు 1100 రూపాయల నుండి 950 రూపాయలు వరకు కొనుక్కొని వచ్చి నారుమడిలో చల్లాలంటే భయపడుతున్నారు రైతులు పండించినటువంటి ధాన్యం అమ్మబోతే అడవి కొనబోతే కొరివిలా తయారైంది వేలాది రూపాయలు వెచ్చించి వరి విత్తనాలు చల్లిన తర్వాత నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా నీరు అందకపోతే రైతులు నష్టపోయే పరిస్థితి ఉన్నది అధికారులు ఇవన్నీటిని పరిగణములోకి తీసుకొని నాగార్జునసాగర్ ఎడమ కాలువ నీటి విడుదల తేదీని ప్రకటించినట్లయితే రైతులు నారు పోసుకునే అవకాశాలు ఉన్నాయని వారన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైత్సంగం జిల్లా సహాయ కార్యదర్శి బిల్లా కనకయ్య తెలంగాణ రాష్ట్ర రైతుసంఘం జిల్లా కౌన్సిల్ సభ్యురాలు ఎర్రబోతు పద్మ సిపిఐ పార్టీ మండల కార్యదర్శి లు ఎండి సయ్యద్ ధీరవ లింగా నాయ క్ చిట్టి మల్ల శీను రన్సింగ్ సైదా తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు