ఎత్తోండలో పర్యటిస్తున్న సెంట్రల్ సెక్రటేరియట్ అధికార భృందం.
కోటగిరి నవంబర్ 2 జనం సాక్షి:-సెంట్రల్ సెక్రటేరియట్ అధికారుల భృందం కోటగిరి మండలంలోని ఎత్తోండ గ్రామంలో ఐదు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు గ్రామంలోని పలు వీధులలో క్షేత్ర స్థాయిలో బుధవారం పర్యటించారు.ఈ పర్యటన కార్యక్రమంలో అధికారులు అభినవ్ సరోహ,అంగ్కాన్ మారిక్, దీప్తి యాదవ్,నీరజ్ కుమారి మీన,అనామిక పాల్ ఉన్నారు.ఈ సందర్భంగా వారు గ్రామంలో అమలవుతున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఏవిధంగా ఉపయోగ పడుతున్నాయనే అంశంపై అధ్యయనం చేస్తున్నారు.గ్రామం శివారు లో రైతులు పండిస్తున్న పండ్లు,కూరగాయలు, వరి,ఫామ్ ఆయిల్ తోటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు.అదేవిధంగా గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సందర్శించి రైతులకు,బ్యాంక్ ఖాతాదారులకు అందుతున్న సేవల గురించి మేనేజర్తో ముచ్చటించా రు.అనంతరం గ్రామంలోని హెల్త్ సబ్ సెంటర్ని సందర్శించి ప్రజలకు అందుతు న్న సేవలపై పలు విషయాలను అడిగి తెలుసుకు న్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సిరిగి సాయిబాబా,ఎంపీటీసీలు ఫారుక్,కల్పన హన్మంతు ,హెల్త్ సూపర్ వైసర్ కృష్ణవేణి,పంచాయతి కార్యద ర్శి ఎముల ఉమాకాంత్,స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు,రైతులు,గ్రామ పెద్దలు,తదితరులు, పాల్గొన్నారు.