ఎన్ఐబీఎస్ రాష్ట్ర అధ్యక్షునిగా డాక్టర్ చింత ఏకలవ్య

 దేవరుప్పుల, జులై 07 (జనం సాక్షి): దేవరుప్పుల మండలకేంద్రానికి చెందిన ‘డాక్టర్ చింత ఏకలవ్య ఎన్ఐబీఎస్ జాతీయ అంతర్జాతీయ బౌద్ధ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడి’గా ఎన్నికయ్యారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 1994 సంవత్సరం నుండి బౌద్ధధర్మం-బహుజనం సాంస్కృతిక,సాహిత్య,సాంఘీక,సామాజిక,ఆర్ధిక,రాజకీయ,రాజ్యాధికార ఉద్యమాల్లో పాల్గొంటూ నావంతు బాధ్యతగా కృషి చేస్తున్నానని
అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికలలో పోటీచేశానని
2015 సంవత్సరంలో నల్లగొండ జిల్లా,నాగార్జున సాగర్ లో జరిగిన అంతర్జాతీయ బౌద్ధధర్మ మహాసమ్మేళనంలో పాల్గొన్నానని
వివిధ దేశాల నుంచి 12 రాష్ట్రాలనుంచి వచ్చిన ప్రముఖ బౌద్ధధర్మ బిక్షువులచే బౌద్ధధర్మ దీక్ష తీసుకున్నానని
ప్రపంచంలో ఏకైక ధర్మం బౌద్ధధర్మం ఒక్కటేనని
ఈ బౌద్ధధర్మంలో కుల,మత, జాతి,వర్ణ,లింగ,భాష అను తారతమ్య భేదాలు ఉండవని
స్త్రీ,పురుషులకు స్వాతంత్య్రము,సమానత్వము,తదితర సర్వహక్కులు కలవని
నాపోరాటాన్ని,కృషి,పట్టుదలను గుర్తించి ఎన్ఐబీఎస్ రాష్ట్ర అధ్యక్ష పదవితో పాటు,బౌద్దధర్మ దీక్షా పత్రాన్ని సమర్పించారని తెలిపారు.

తాజావార్తలు