ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణకు చంద్రబాబుకు ఆహ్వానం

హైదరాబాద్‌, జనంసాక్షి: పార్లమెంట్‌లో ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాలని చంద్రబాబుకు ఆహ్వానం లభించింది. లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌ కార్యాలయం నుంచి తెదేపా అధినేత చంద్రబాబుకు అధికారికంగా ఈ ఆహ్వానం లభించింది.