ఎన్టీపీసీలో తగ్గిన విద్యుదుత్పత్తి
గోదావరిఖని : బొగ్గుకొరత కారణంగా రామగుండం ఎన్టీపీసీ దాదాపు 600 మెగావాట్ల విద్యుదుత్పత్తిని తగ్గించుకుంది. 2600మెగావాట్ల సామర్ధ్యం కలిగిన ఎన్టీపీసీ దాదాపు 1900 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసింది. గత వారం రోజులుగా సింగరేణి నుంచి బొగ్గు సరఫరా తగ్గటంతో ఎన్టీపీసీ ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.