ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు
అభ్యర్థులకు అధికారుల హెచ్చరిక
వరంగల్,జనవరి24(జనంసాక్షి): ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని అధికారులు రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు సూచించారు. ఇప్పటికే సర్పంచ్, వార్డు అభ్యర్థులకు ఎన్నికల ప్రవర్త న నియామావళిపై అవగాహన సదస్సు నిర్వహించారు. సర్పంచ్, వార్డు అభ్యర్థులు ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రతీ అభ్యర్థి ఎన్నికల ఖర్చులు చూపించాలన్నారు. లేని పక్షంలో మరోసారి పోటీకి అనర్హులవుతారని చెప్పారు. గ్రామంలో ఐదువేల లోపు జనా భా ఉంటే సర్పంచ్ అభ్యర్థులు రూ.1.50లక్షలు, వార్డు అభ్యర్థులు రూ.30వేలు ఖర్చు చేసుకోవచ్చన్నారు. ఐదువేలకు పైగా జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ.2.50లక్షలు, వార్డు అభ్యర్థులు రూ.50వేలు ఖర్చు చేసుకునే అవకాశం ఉందన్నారు. అభ్యర్థులు బ్యాంకు ఖాతా ద్వారానే ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపారు. 45 రోజులలోపు ఎన్నికల్లో ఖర్చుచేసిన వివరాలు మండల పరిషత్ కార్యాలయంలో మండల ఆడి ట్ అధికారికి సమర్పించాలన్నారు. అభ్యర్థులు ప్రచారంలో నమూనా గుర్తు మాత్రమే ప్రదర్శించాలనీ, కరపత్రాలు, వాల్ ముద్రణదా రు పేరు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఆలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద సమావేశాలు నిర్వహించవద్దన్నారు. సభలు, సమావేశాల నిర్వహణకు ముందుగా అనుమతి తీసుకోవా లన్నారు. అభ్యర్థులు తమ తరపున ఏజెంట్ల పేర్లు ఎన్నికల అధికారులకు అందించి పోలింగ్ ఒక రోజు ముం దుగానే అనుమతి పత్రాలు తీసుకోవాలన్నారు. పోలింగ్ రోజు ఉదయం ఆరు గంటలకే బ్యాలెట్ పత్రాలకు, బాక్సులకు సీల్ వెస్తారనీ, వాటిని ఏజెంట్లు చూసుకోవాలన్నారు.ఎవరైనా మద్యం, డబ్బులతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే ఫిర్యాదు చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్ర చారం నిర్వహిస్తే కేసులు తప్పవని హెచ్చరించారు. గెలుపొందిన అభ్యర్థులు అనుమతి లేకుండా విజయోత్సవ ర్యాలీలు జరుపవద్దన్నారు.
—–
——————
——–
—-
——
—————-
——————-