ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా

మహిళలపై వేధింపులు తగ్గడం లేదు

కేంద్ర మంత్రి పురందేశ్వరి

హైదరాబాద్‌ : మహిళలను దేవతలుగా పూజించే ఈ దేశంలోనే మహిళలు తీవ్ర వివక్షకు గురవుతున్నారని కేంద్ర మంత్రి పురందేశ్వరి ఆవేధన వ్యక్తం చేశారు. బ్రూణ హత్యలు, బాల్య వివాహాలు, వరకట్నం, గృహ హింస నిరోధానికి అనేక చట్టాలు తీసుకువచ్చినా నేటికి వేధింపులు తగ్గడం లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ సత్యసాయి నిగమాగమంలో నిర్వహించిన కొవే పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. మహిళలకు పూర్తిస్థాయిలో ఆర్థిక స్వేచ్ఛ లభించిన నాడే వివక్ష తొలగిపోతుందని అన్నారు.