ఎన్‌పీఎం సిబ్బంది తోలగింపును నిరసిస్తూ ధర్నా, వేతనాలు పెంచే వరకు ఉద్యమం
ఖమ్మంసంక్షేమ విభాగం,జనంసాక్షి : దీర్ఘకాలంగా ఇందిరా క్రాంతిపథంలో పనిచేస్తున్న ఎన్‌పీఎం (సుస్థిర సేంద్రియ వ్యవసాయం) సిబ్బందిని అకారణంగా తోలగించడాన్ని నిరసిస్తూ మంగళవారం ఖమ్మం నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్ధ కార్యలయం నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు.మూడు సంఘూల నాయకులు ఎం.వెంకటేశ్వర్లు కి.కిశోర్‌బాబు,నరేశ్ మాట్లాడుతూ జిల్లాలో 2005 నుంచి సౌకర్యాలు కల్పించకపోగా సమ్మె చేస్తున్నారని తోలగించడం సమంజసం కాదన్నారు.నిత్యావసరాల ధరలు రోజురోజుకు పెరుగుతున్నా వేతనాలు పెంచకపోవడంతో సిబ్బంది పరిస్థితి దయనీయంగా మారిందన్నారు.సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా గత నెల 28నాటికి పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా నేటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆందోళన బాట పట్టామన్నారు.ఐకేపీ సిబ్బంది సంక్షేమ సంఘం నాయకులు సంపత్ తదితరులు పాల్గోన్నారు.