ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతలపై స్టే


హైకోర్టును ఆశ్రయించిన నటుడు నాగార్జున
హైదరాబాద్‌,ఆగస్ట్‌24(జనంసాక్షి): టాలీవుడ్‌ నటుడు నాగార్జుకు సంబంధించిన ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేత వ్యవహారంలో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ స్టే విధించింది. కూల్చివేతలను ఆపేయాలని హైకోర్టు శనివారం నాడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గండిపేట ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా రaుళిపిస్తోంది. అక్రమ కట్టాలను నేలమట్టం చేస్తోంది. ఈ క్రమంలోనే తమ్మిడి చెరువును ఆక్రమించి ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను నిర్మించారని ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వీటిని పరిశీలించిన హైడ్రా.. శనివారం ఉదయాన్నే ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను నేలమట్టం చేసింది. అయితే, ఈ అంశంపై ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ భాగస్వామ్య యజమాని అయిన అక్కినేని నాగార్జున తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పట్టా భూమిలో కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మించామని, ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు నాగార్జున. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా కూల్చివేతలు చేపట్టారని పిటిషన్‌లో పేర్కొన్నారు. 200 మంది పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేసి మరీ కూల్చివేశారన్నారు. 2014లో అప్పటి ఇరిగేషన్‌, జిహెచ్‌ఎంసి అధికారులు బిల్డింగ్‌ని కొలుస్తామని హెచ్చరించారని.. ఎఫ్‌టిఎల్‌లో బిల్డింగ్‌ ఉందని అప్పటి అధికారులు కూల్చేందుకు వచ్చారని గుర్తు చేశారు. అయితే, 2014లోనే హైకోర్టు ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతపై స్టే ఆర్డర్‌ ఇచ్చిందన్నారు. అప్పటికి ఇంకా ఎఫ్‌టిఎల్‌ను నోట్గిª చేయలేదు కాబట్టి కూల్చే ముందు నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు.