ఎపిలో పెరుగుతున్న కేసు సంఖ్య

పరీక్షస్థాయిని పెంచిన సర్కార్‌
అమరావతి,జూన్‌8(జ‌నంసాక్షి): ఎపిలో పరీక్ష సంఖ్య పెరుగుతున్నకొద్దీ కేసు సంఖ్యా పెరుగుతోంది. అలాగే కోుకుంటున్న వారి సంఖ్యా పెరుగుతోంది. ఈ దశలో ప్రజు వ్యక్తిగత రక్షణ చర్యు తీసుకోవాని వైద్యాధికాయి హెచ్చరిస్తున్నారు. పదిక్ష జనాభాకు సగటున 8,502 మందికి పరీక్షు చేయడం ద్వారా ఎపి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఒకే రోజు 17,695 మందికి కరోనా పరీక్షు నిర్వహించి రాష్ట్రం సరికొత్త రికార్డు సృష్టించింది. రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 199 కొత్త కేసు నమోదయ్యాయి. వీరిలో 130 మంది రాష్ట్రంలోని వారు కాగా, 69మంది ఇతర రాష్టా నుంచి వచ్చిన వారున్నారు. ఇప్పటి వరకు పరీక్షు చేసిన వారి సంఖ్య 4,54,030కు చేరగా, శనివారం ఉ.9 గంట నుంచి ఆదివారం ఉదయం 9 గంట వరకు నిర్వహించిన పరీక్షల్లో మొత్తం 199 మందికి పాజిటివ్‌ క్షణాు ఉన్నట్లు నిర్దారించారు. ఇందులో 130 మంది ఎపికి చెందిన వారు కాగా 69 మంది వివిధ రాష్ట్రా నుంచి వచ్చిన వారున్నారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసు సంఖ్య 4,659కి చేరింది. ఇందులో 810 కేసు వివిధ రాష్ట్రా నుంచి వచ్చినవారివి కాగా, 131 విదేశా నుంచి వచ్చిన వారివి ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 59 మంది డిశ్చార్జి కావడంతో మొత్తం కోుకున్న వారి సంఖ్య 2,660కు చేరింది. కొత్తగా డిశ్చార్జి అయిన వారిలో 30 మంది ఇక్కడి వారు కాగా, ఇతర రాష్ట్రా నుంచి వచ్చిన వారు 28, విదేశా నుంచి వచ్చిన వారు ఒకరు ఉన్నారు. కృష్ణా, కర్నూు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించడంతో మరణా సంఖ్య 75కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసు సంఖ్య 1,924గా ఉన్నాయి. వీటితో కలిపి మొత్తం పాజిటివ్‌ కేసు 4,659కి పెరిగాయి. వీటిలో 3,718
మంది రాష్ట్రంలోనివారికి, విదేశా నుంచి వచ్చిన 131మందికి, ఇతర రాష్టా నుంచి వచ్చిన 810మందికి వైరస్‌ సోకింది. కరోనా బారిన పడి కర్నూు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందినట్లు ఆరోగ్యశాఖ నిర్దారించింది. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా మరణా సంఖ్య 75కు చేరాయి. డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ కార్యాయంలో అటెండర్‌తో పాటు ఎక్టీష్రియన్‌కు కరోనా సోకింది. దీంతో ఉద్యోగుంతా ఆందోళన చెందుతున్నారు. కడప జిల్లాలో ఒక్కరోజే 32కేసు నమోదయ్యాయి. వీరిలో మైవరం మండం నవాబుపేటలోనే 26 మంది ఉన్నారని వైద్యఆరోగ్య శాఖ జిల్లా అధికారి ఉమాసుందరి తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలో మరో 27మంది కరోనా బారినపడ్డారు. కొవిడ్‌ ఆస్పత్రికి చెందిన ఒక స్టాఫ్‌నర్సుకు పాజిటివ్‌ వచ్చింది. కృష్ణాజిల్లాలో కొత్తగా 25మందికి వైరస్‌ సోకింది. న్లెూరు జిల్లాలో మరో 22కేసు నమోదయ్యాయి. వీరిలో 9మంది వస కార్మికున్నారు. కర్నూు జిల్లాలో మరో 10మందికి కరోనా నిర్దారణ అయింది. వీటితో కలిపి ఈ జిల్లాలో కేసు సంఖ్య 772కు చేరింది. తూర్పుగోదావరి జిల్లాలో మరో 7కేసు మెగు చూశాయి. వీరిలో రాయవరం, అన్నవరం మండలాల్లో ముగ్గురు చొప్పున, బొమ్మూరు క్వారంటైన్‌ సెంటర్లో ఒకరు ఉన్నారు. గుంటూరులోని జిల్లాకోర్టులో తోటమాలికి, న్లపాడు పోలీస్‌స్టేషన్‌లో ఓ కానిస్టేబుల్‌కు పాజిటివ్‌ వచ్చింది. విజయనగరం జిల్లా కేంద్రంలోని క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉంటున్న ముగ్గురికి వైరస్‌ నిర్దారణ అయింది. విశాఖ జిల్లాలో మరో 15మంది వైరస్‌ బారిన పడ్డారు. వీటితో కలిపి ఈ జిల్లాలో పాజిటివ్‌ కేసు సంఖ్య 179కి చేరింది. ఇదిలాఉండగా, తిరుపతిలో ఆదివారం ఓ వృద్ధురాు(70) కరోనాతో మృతి చెందారు. తీవ్ర శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న ఆమెను కుటుంబీకు రుయాస్పత్రి క్యాజువాలిటీకి చికిత్స నిమిత్తం తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటికే ఆమె మృతి చెందినట్లు వైద్యవర్గాు తెలిపాయి. ట్రూనాట్‌ ద్వారా పరీక్ష చేయగా కరోనా నిర్దారణ అయింది. చిత్తూరు జిల్లాలో మరో నుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.