ఎపి ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం

పార్లమెంటులో ఎంపిలు గట్టిగా పోరాడారు

కేంద్రం ద్రోహం కారణంగా రోడ్డున పడ్డాం

తాతకుంట్ల గ్రామదర్శినిలో చంద్రబాబు

విజయవాడ,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): పార్లమెంట్‌లో మన ఎంపీలు గొప్పగా పోరాడారని, మన ఎంపీలు ఢిల్లీని గడగడలాడించారని సీఎం చంద్రబాబు కొనియాడారు. కృష్ణా జిల్లా తాతకుంట్లలో గ్రామదర్శిని కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రామదర్శినిలో ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. చంద్రబాబు శుక్రవారం కృష్ణాజిల్లాలో పర్యటించారు. విస్సన్నపేట మండలం తాతకుంట్లలో గ్రామదర్శిని కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అడ్డగోలుగా కాంగ్రెస్‌ రాష్ట్రాన్ని విభజించిందని, ఏపీకి రాజధాని లేదని, ఆదాయం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలు, కాలేజీలు లేవని, ఆదాయం వచ్చే మార్గం లేదని చెప్పారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నామని సీఎం స్పష్టం చేశారు. నాలుగేళ్లలో ఎంతో అభివృద్ధి సాధించామని, ప్రత్యేక ¬దా, విభజన హావిూలు అమలు చేయకుండా ఎన్డీఏ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసింది. రాష్ట్ర సమస్యలపై 29సార్లు ఢిల్లీ వెళ్లాను. పెడచెవిన పెట్టడంతో అనుమానం వచ్చింది. ఎన్డీఏ నుంచి బయటికి వచ్చాం. కేంద్రంపై అవిశ్వాసం పెట్టాం. ప్రధాని మోదీని పార్లమెంటులో నిలదీసిన వ్యక్తి కేశినేని నాని. కుట్ర రాజకీయాలతో దెబ్బతీయాలని చూస్తున్నారు. హక్కులు సాధించే వరకు రాజీపడేది లేదు. వైసీపీకి సిద్దాంతం చేదు. వైసీపీ సభ్యత లేని పార్టీ. అవీనీతి కేసుల్లో వైసీపీ కూరుకుపోయింది. కేసుల మాఫీ కోసం పుట్టిన పార్టీ వైసీపీ. జగన్‌వి పద్దతిలేని, పసలేని విమర్శలు. ఒక్కోసారి బాధేసినా ప్రజల కోసం భరిస్తున్నా. మాట తప్పింది. మడమ తిప్పింది కేంద్రమే అంటూ చంద్రబాబు దుయ్యబట్టారు. ఈ సందర్భంగా రచ్చబండలో గ్రామస్తులు, మహిళలతో సీఎం మాట్లాడి… వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విభజనతో కట్టుబట్టలతో ఏపీకి వచ్చామని.. చాలా ఇబ్బందులు పడ్డామన్నారు. తాము చేసేదే చెబుతామని… చెప్పింది చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ నాలుగేళ్లల్లో రాష్ట్రంలో జరిగిన

అభివృద్ధిని చూసి ప్రజలు ఆలోచించాలన్నారు. తప్పు చేస్తే భయం ఉంటుందని.. అందుకే విపక్షాలు అబద్దాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రజాసంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత జగన్‌, జనసేనాని పవన్‌కల్యాణ్‌పై సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. జగన్‌, పవన్‌కల్యాణ్‌ను పక్కన పెట్టుకుని, కేంద్రం ఏపీకి నమ్మకద్రోహం, అన్యాయం చేసిందని ఆరోపించారు. పవన్‌ ఇప్పుడు రూటే మార్చేశాడని, మనల్నే విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి రూ. 75వేల కోట్లు రావాలని, ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీ చెబితే పవన్‌ ఎందుకు మాట్లాడలేదని, మాట తప్పింది… మడమ తిప్పింది కేంద్రమేనంటూ విమర్శించారు. ప్రజల ముందు ఎన్డీఏ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టామని చంద్రబాబు చెప్పారు.

నేడు చెన్నైకి చంద్రబాబు

సీఎం చంద్రబాబు శనివారం చెన్నై వెళ్లనున్నారు. గత కొన్ని రోజులుగా కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని పరామర్శించనున్నారు. తన చెన్నై పర్యటన ముగించుకుని సాయంత్రం తిరుపతి చేరుకోనున్నారు. ఎస్వీయూలో విద్యార్థులతో ‘జ్ఞానభేరి’ పేరిట ముఖాముఖి నిర్వహించనున్నారు. వారికి లక్ష్యాలను బోధించడంతో పాటు మెరుగైన పాలనకు తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు స్వీకరించనున్నారు.

 

తాజావార్తలు