ఎఫ్‌డిఐకి వ్యతిరేకంగా ఓటు : జయలలిత
హైదరాబాద్, నవంబర్ 20 (జనంసాక్షి):
పార్లమెంట్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) బిల్లు పెడితే తాము వ్యతిరేకంగా ఓటు వేస్తామని అన్నా డిఎంకె అధినేత జయలిలత చెప్పారు. రానున్న పార్లమెంటు సమావేశాలలో అనుసరించాల్సి వ్యూహం, ఎఫ్‌డిఐ, గ్యాస్ సిలెండర్లపై పరిమితి వంటి ప్రభుత్వ విధానాలు, తృణమూల్ ప్రతిపాదిస్తున్న అవిశ్వాసం తదితర అంశాలపై పార్టీ ఎంపీలతో ఆమె మంగళవారం చర్చించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కేంద్రంపై అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెడితే చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. 2జి స్పెక్ట్రాంలో అవినీతి జరగలేదని కాంగ్రెస్ పార్టీ చెప్పడాన్ని ఆమె ఖండించారు. స్కాం జరగలేదనడం కాంగ్రెస్ ఆడుతున్న పెద్ద నాటకం అని ఆమె అన్నారు.