ఎఫ్‌డీఐలపై కేంద్రం కఠిన వైఖరి వీడాలి: భాజపా
న్యూఢిల్లీ: ఎఫ్‌డీఐల ఆంశంపై కేంద్రం తన కఠిన వైఖరిని వదిలిపెట్టి సభ సజావుగా సాగేందుకు సహకరించాలని భాజపా కోరింది. ఎఫ్‌డీఐల అంశంపై ఈ సజావుగా సాగేందుకు సహకరించాలని భాజపా కోరింది.ఎఫ్‌డీఐల అంశంపై ఈ ఉదయం భాజపా పార్లమెంటరీ పార్టీ నేతలు భేటీ అయ్యారు. సుష్మాస్వరాజ్, అద్వానీ, గడ్కరీ తదితరులు హాజరై చర్చించారు. ఎఫ్‌డీఐలపై ఓటింగ్‌తో కూడిన చర్చ డిమాండ్ నుంచి వెనక్కితగ్గేది లేదని భేటీ అనంతరం నేతలు తేల్చిచెప్పారు. విపక్షాల డిమాండ్‌ను అంగీకరించి కేంద్రం పార్లమెంట్‌ను సజావుగా నడిపించేందుకు ముందుకురావాలని సూచించారు.