ఎఫ్‌డీఐలపై ముగిసిన అఖిలపక్ష సమావేశం
ఓటింగ్ లేకుండా చర్చ మెజార్టీ అభిప్రాయం : మంత్రి
ఓటింగ్‌తో కూడిన చర్చ విషయమై వెనక్కి తగ్గేది లేదు: సుష్మ
యూపీఏ సమావేశం రేపు
ఢిల్లీ: చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యేక్ష పెట్టుబడులపై అఖిల పక్ష సమావేశం ముగిసింది. ఓటింగ్ లేకుండా చర్చ చేపట్టాలని మెజార్టీ అభిప్రాయం వ్యక్తమైందని కేంద్రమంత్రి ఆనంద్ శర్మ పేర్కొన్నారు. ఈ అంశంపై ఓటింగ్ తోకూడిన చర్చకు భాజపా, జేడీయూ, వామపక్షాలు పట్టుపట్టగా, స్పీకర్ ఏ నిబంధన కింద అనుమతించినా చర్చకు సిద్ధమని ఎస్సీ ప్రకటించింది. ఓటింగ్‌తో కూడిన చర్చ విషయమై వెనక్కి తగ్గేది లేదని సుష్మాస్వరాజ్ అన్నారు. ఏ నిబంధన కింద్ర చర్చ చేపడతారో ఉభయసభల సభాపతుల నిర్ణయానికే వదిలేస్తున్నామని బీఎస్పీ నేత మాయావతి అన్నారు. సభ ఎలా జరగాలో స్పీకరే నిర్ణయిస్తారని అఖిల పక్ష సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్ అభిప్రాయపడింది. చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐల పై డీఎంకే అభ్యంతరాలు వ్యక్తం చేయగా, ఓటింగ్‌తో కూడిన చర్చ చేపట్టాలని అన్నాడీఎంకే పేర్కొంది. ఎఫ్‌డీఐలపై పార్లమెంటులో చర్చ విషయమై యూపీఏ రేపు సమావేశం కానుంది.