ఎఫ్‌సీఐ పునరుద్దరించడం సంతోషం:వివేక్‌

కరీంనగర్‌,(జనంసాక్షి): గోదావరిఖనిలోని ఎఫ్‌సీఐ పునరుద్దరించడం సంతోషంగా ఎందని ఎంపీ వివేక్‌ తెలిపారు. ఎఫ్‌సీఐని పునరుద్దరించినందుకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎఫ్‌సీఐ విషయంలో సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి చేసిందేమిలేదు అని చెప్పారు. తెలంగాణకు ప్యాకేజీ ఇస్తే సరిపోతుందని సీఎం అంటున్నారని పేర్కొన్నారు. టీ కాంగ్రెస్‌ నేతలకు చిత్తశుధ్ది ఉంటే సీఎంను నిలదీయాలని డిమాండ్‌ చేశారు. ప్యాకేజీ, రాయల తెలంగాణకు ఒప్పుకునేది లేదు అని స్పష్టం చేశారు. తమకు పదిజిల్లాలతో కూడిన తెలంగాణనే కావాలని తేల్చిచెప్పారు. కేంద్రానికి గవర్నర్‌ తప్పుడు నివేదికలు సమర్పిస్తున్నారని ఆరోపించారు. గవర్నర్‌ కూడా తప్పుడు నివేదికలు ఇచ్చి కేంద్రాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.