ఎమ్మెల్యే పైన కాంట్రాక్టర్ దానయ్య ఆరోపణలు సిగ్గుచేటు – ఎంపీపీ కృపేష్
రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసా క్షి):-పంచాయతీ రాజ్ ఆధీనంలో గల జడ్పీ గెస్ట్ హౌస్ భవనం నిర్మాణానికి 2012-18 లో ₹30 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది ఈ 30 లక్షల నిధులతో భవనం నిర్మించడం జరిగింది. కేవలం డోర్లు, ఫ్లోరింగ్, కరెంటు, పెయింటింగ్ పనులు మిగిలి ఉండడం జరిగింది. ఈ పనులు పూర్తి చేయమని ఎమ్మెల్యే గారు 1సంవత్సరం కిందట కాంట్రాక్టర్ దానయ్య కి చెప్పడం జరిగింది. పనులు పూర్తి చేసిన దానయ్య కి పంచాయతీ రాజ్ ఇంజినీర్లు ఎస్టిమేషన్ ప్రకారం ఎమ్మెల్యే గారు ప్రొసీడింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ కాంట్రాక్టర్ దానయ్య ప్రొసీడింగ్ తీసుకోకుండా 6 నెలలు కాలక్షేపం చేసి ఇపుడు వచ్చి 50 లక్షలు బిల్లు పెండింగ్ ఉందంటూ తప్పుడు ఆరోపణలు చేయడం జరుగుతుంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను , జడ్పీ గెస్ట్ హౌస్ భవనం పూర్తి నిర్మాణం ఖర్చు 40 లక్షలకు మించదు . ఇప్పటి వరకు 30 లక్షల నిధులు ఎంబీ రికార్డ్ చేసి కాంట్రాక్టర్ దానయ్య డ్రా చేసుకోవడం జరిగింది . మిగితా 10 లక్షలు ఇవ్వడానికి ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యే ఎవరిని ఇబ్బంది పెట్టిన చరిత్ర లేదు. కొన్ని కోట్ల నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే పైన ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదు. రాజకీయాల కోసం ప్రతిపక్ష నాయకులు దానయ్య ని పావుగా వాడుకొని ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయించడం సరియైన పద్ధతి కాదని అన్నారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిలుకలు బుగ్గరాములు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఏనుగు భరత్ రెడ్డి, సర్పంచ్ అశోక్ వర్ధన్ రెడ్డి, నాయకులు మంద సురేష్ , డేరంగుల నర్సింహ, గంగిడి భాస్కర్ రెడ్డి, కత్తుల కుమార్ , సామల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు