ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సహకారంతోనే మార్కెట్ కమిటీ అభివృద్ధి.

మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్.
తాండూరు అక్టోబర్ 12(జనంసాక్షి)ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సహకారంతోనే తాండూరు
వ్యవసాయ మార్కెట్ కమిటీ అన్ని విధాల అభివృద్ధి చెందిందనిమార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ పేర్కొన్నారు.బుధవారం
వికారాబాద్ జిల్లా తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్  మాట్లాడుతూ రెండు సంవత్సరాలుగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సహకారంతో  పట్టణ కేంద్రంలో కోటి రూపాయలతో షెడ్ల నిర్మాణం, 10 లక్షలతో సీసీ కెమెరాలు, రైతులకు విశ్రాంతి గది, రైతులకు మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు.అదేవిధంగా 30 సంవత్సరాలుగా జరగ లేని అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సహకారంతో కొత్త మార్కెట్ యాడ్ ఏర్పాటుకు బషీర్ మియా తాండ సమీపంలో 30 ఎకరాల లో జీవో తీసుకురావడం జరిగిందన్నారు. 25  కోట్ల రూపాయలతో శంకుస్థాపన త్వరలో జరగనుంది. రాష్ట్రంలోని మునుగోడు నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికల సందర్భంగా అతి త్వరలో తాండూరు లో కొత్త మార్కెట్ యాడ్ శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు.  ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి రెండు సంవత్స రాలు అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యే కు పాలక వర్గం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అడుగుజాడల్లో నడిచి వారి ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో  వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తాటికొండ స్వప్న పరిమళ్,  మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు  పద్మమ్మ, మల్లప్ప, సప్తగిరి గౌడ్, భీమ్ రెడ్డి, కట్కం వీరేందర్, మహమ్మద్ ఇర్ఫాన్,, దినేష్ ఠాగూర్,  మార్కెట్ కమిటీ కార్యదర్శి రాజేశ్వరి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.