ఎమ్మెల్యే మహేష్ రెడ్డి కృషితోనే చౌడపూర్ మండల కేంద్రం ఏర్పాటు..
– ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి ఓర్వలేకనే మహేష్ రెడ్డిని విమర్శించడం
– టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి
చౌడాపూర్, జులై 23( జనం సాక్షి): వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యే మహేష్ రెడ్డిని ప్రతిపక్ష పార్టీ నాయకులు పరిగి ప్రాంత అభివృద్ధి మరియు మండలాల అభివృద్ధిని చూసి ఓర్వలేక, ఏమి తెలియకుండా పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డిని విమర్శించడం సరికాదని చౌడాపూర్ టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే యొక్క A.C.D.P నిధులను ఏ ఒక్క గ్రామ పంచాయతీకి కూడా కేటాయించకుండా తన ఇష్టానుసారంగా ఖర్చు చేసుకోవడం జరిగింది. అదే ఇప్పుడున్న ఎమ్మెల్యే మహేష్ రెడ్డి యొక్క నిధులను నూతనంగా ఏర్పడిన గ్రామపంచాయతీలకు బిటి రోడ్లకు కోటి రూపాయల నిధులను కేటాయించడం జరిగింది. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా 2 కోట్లతో గ్రామపంచాయతీలలో సిసి రోడ్ల నిర్మించడం జరిగింది. ఎంపీపీ మరియు జెడ్పిటిసి నిధులతో కూడా వివిధ గ్రామపంచాయతీలలో సైడ్ డ్రైన్ నిర్మాణ పనులు మరియు మట్టి రోడ్లు కూడా వేయడం జరిగింది. అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే కాకుండా ప్రతిపక్ష పార్టీ నాయకులకు సైతం సీఎం రిలీఫ్ ఫండ్ కింద నిధులు మంజూరు చేయిస్తూ నిరుపేద కుటుంబాలకు దగ్గరవుతూ, ప్రజల్లో ఆదరణ పొందుతున్నాడని పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డిని విమర్శించడం సరికాదని హెచ్చరించడం జరిగింది. ఇదంతా అభివృద్ధి కాదా, ప్రతిపక్ష పార్టీలకు కనిపించడం లేదా అని చౌడపూర్ మండల కేంద్రంలో నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ లో చౌడపూర్ మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడడం జరిగింది. ఈ కార్యక్రమంలో చౌడపూర్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ నాగరాజు,జెడ్పిటిసి రాందాస్ నాయక్,ఎంపీటీసీల మండల పోరం అధ్యక్షుడు రాంలాల్,చౌడపూర్ మండల టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లింగంపల్లి నర్సింలు, ఎంపీటీసీ శంకర్,మందిపాల్ ఎంపిటిసి తనయుడు శంకర్, టిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు అశోక్, మైనార్టీ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గౌస్,మాజీ సర్పంచ్ పాల నర్సింలు తదితరులు పాల్గొనడం జరిగింది.
Attachments area