*ఎమ్మెల్యే. సి.ఎం కెసిఆర్ ల పై ఎం పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల పై తెరాస నేతల ఫైర్

. జనం సాక్షి
గురువారం  భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మిర్యాలగూడ లో  స్థానిక శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు. సీఎం కెసిఆర్ పై తన స్థాయి మరచి వ్యక్తిగత దూషణలతో పలు నిందారోపణలు చేసినందుకు నిరసన గా తెరాస నేతలు మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి. మండల పార్టీ అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి లు శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పొంతన లేని మాటలతో కాంట్రాక్ట్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటూ నిరాదర ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖoడిస్తూ ఆరోపణలు నిరూపిస్తే దేనికైనా సిద్దం లేదా మీరు భహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు.గత తొమ్మిది సంవత్సరాలుగా ఏరోజైన ఎమ్మెల్యే  అవినీతికి పాల్పడినట్టు కాని వ్యాపారస్తులను బెదిరించడం కాని, అధికార పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ ఏనాడూ పోలీస్ స్టేషన్ లో గాని మరియు ఏ ఇతర కార్యాలయాల్లో గాని తన వారికి పనులు చెయ్యాలని ఒత్తిడి చేసిన సందర్భాలు లేవన్నారు .స్థానిక పరిస్థితులు బట్టి సరైన చర్యలు తీసుకునే విధంగా పోలీస్ శాఖకు అనుమతించారే తప్ప ఎవరిని ఆఖరికి పార్టీ వారిని కూడా ఉపెక్షించలేదని.ఉదాహరణకు ఇటివల శరణ్య గ్రీన్ హోమ్ దారి విషయం అయి పార్టీ కౌన్సిలర్ ను కూడా వెనకవేసుకొని రాలేదన్నారు.వ్యవసాయాన్ని పండగ చేసి నియోకవర్గం మొత్తం రైతుకు గిట్టు బాటు ధర కలిపించారు,కేంద్రాన్ని యాసంగి లో పండిన వడ్లు కొనాలి అని నిలదిసినప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా మీరు ఏం చేసారు.అసెంబ్లీ సాక్షిగా 2018 లో భాస్కర్ రావు  మరల ఎమ్మెల్యేగా గెలిస్తే మిర్యాలగూడ తెరాస పార్టీ  కార్యాలయం లో అటెండర్ గా  పని చేస్తా అన్న సవాలు మీరు మరిచారా.ఎమ్మెల్యే  కుమారుడు నల్లమోతు సిద్దార్ధ  తండ్రి పేరు మీద ఏర్పాటు చేసిన ఎన్ బి ఆర్ ఫౌండేషన్ ద్వార నియోజకవర్గం మొత్తం అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ నిరుద్యోగులకు ఉచిత శిక్షణను అందిస్తూ జాబ్ మేళా ద్వారా గత నాలుగు సంవత్సరాలుగా వేలాది మందికి ఉద్యోగ అవకశాలు కల్పించారన్నారు
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  తన స్థాయి మరచి సిద్దార్ధ ను కూడా వ్యక్తి గతంగా దూషించడం తగదు అని హితువు పలికారు, లేని యెడల మిర్యాలగూడ నియోజకవర్గం లో యువత మిమ్మల్ని తీవ్రంగా ప్రతి ఘటిస్తారు అని హెచ్చరిచారు.
ప్రతి పక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు సినిమా ధియేటర్ నుంచి బయటకి వచ్చి రౌడీయిజం చేస్తూ పోలీసులు చర్యలు తీసుకుంటే దానిని కూడా దిగజారి మాట్లాడుతూ  ఎమ్మెల్యే గారి ప్రోత్బలం తోనే అక్రమ కేసులు బనాయించడం అని చెప్పడం మీ బాధ్యత రహిత్యం కాదా అని ప్రశ్నించారు.ఎవరు ఎన్ని అవాకులు చెవాకులు పేలిన ముచ్చటగా మూడో సారి భాస్కర్ రావు ని గతంలో కంటే భారీ మెజారిటీ తో గెలిపించడానికి బడుగు బలహీన వర్గాలు, దళితులు, మైనారిటీలు అందరు సిద్దంగా ఉన్నారు అని అన్నారు.
ఇప్పటికి అయిన బుద్ధి తెచ్చుకొని సొంత పార్టీలో ఉన్న గ్రూప్ లపై దృష్టి పెట్టి చక్కదిద్దుకోవాలని హితవు పలికారు.నిత్యం నియోజకవర్గ అభివృద్ధి కై తన సమయాన్ని కేటాయిస్తూ అహర్నిశలు శ్రమిస్తున్న భాస్కర్ రావు పై నిందారోపణలు మానుకోవాలని అని లేదా ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెప్తారని హెచ్చరిoచారు.సమావేశం లో, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, సీనియర్ నయకులూ అన్నభిమోజు నాగార్జున చారి, డీసీఎంస్ వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి, వేములపల్లి మాజీ ఎంపీపీ నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, పి ఏ సీ ఎస్ చైర్మన్ వేలిశెట్టి రామకృష్ణ, రైతు సంఘం జిల్లా మాజీ అద్యక్షులు నామిరెడ్డి యాదగిరి రెడ్డి, తెరాస పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు వంగాల నిరంజన్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ మాజీద్, నాయకులూ పునాటి లక్ష్మినారాయణ, సాదినేని శ్రీనివాస్, పట్టణ తెరాస అధికార ప్రతినిధి పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
Attachments area

తాజావార్తలు