ఎమ్మెల్యే సుంకె ఆధ్వర్యంలో ప్రచారం
టిఆర్‌ఎస్ కోసం ఇంటింటా ప్రచారలో పాల్గొన్న మహిళలు
హుజూరాబాద్,అగస్టు23(జనంసాక్షి): టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు మద్దతుగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో మహిళలు ఇంటింటా ప్రచారం నిర్వహించారు.సంక్షేమ సారథి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇల్లందకుంట మండలంలోని గడ్డివానిపల్లి గ్రామ మహిళలు అండగా నిలిచారు.
మహిళలు ప్రతి ఇంటికి వెళ్లి సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ.. గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు అండగా నిలిచి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మహిళల కోసం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. కల్యాణలక్ష్మి, ఆరోగ్య లక్ష్మి, కేసీఆర్ కిట్, అమ్మ ఒడి లాంటి పథకాలను అమలు చేయడమే కాకుండా, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులు, వృద్ధులకు, దివ్యాంగులకు ఆసరా పెన్షన్లు అందిస్తున్నారని పేర్కొన్నారు. దళిత బంధు పథకం ద్వారా దళితులకు నేరుగా అకౌంట్లో డబ్బులు జమ చేసి ఆర్థికంగా ఎదిగేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మహిళలు తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి దళిత బంధు పథకం అమలు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ మరో రూ. 500 కోట్లు విడుదల చేశారు. నిధుల విడుదలపై దళితులు హర్షం వ్యక్తం చేస్తూ సంబురాలు చేసుకున్నారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. బాణాసంచా కాల్చారు. పథకం అమలు కోసం నిధులు విడుదల చేసిన సీఎం కేసీఆర్‌కు దళితులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని హుజూరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా నియోజకవర్గంలో దళితబంధు కోసం మరో రూ.500 కోట్లు విడుదల చేసింది. హుజూరాబాద్ సభ అనంతరం పైలట్ ప్రాజెక్టు అమలుకోసం మొత్తం రూ.2 వేల కోట్ల నిధులు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మొదటి విడతలో భాగంగా ఇప్పటికే రూ.500 కోట్లు విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన రూ.500 కోట్లు కలిపి హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పైలట్ ప్రాజెక్టుకుగాను మొత్తం రూ.వెయ్యి కోట్ల నిధులు విడుదలయ్యాయి. కాగా.. వారం రోజుల్లోపు మరో రూ.వెయ్యి కోట్లు ప్రభుత్వం విడుదల చేయనున్నది. దీంతో సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.2 వేల కోట్ల నిధులు పూర్తి స్థాయిలో విడుదల కానున్నాయి. ఈనెల 16న సీఎం కేసీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు లబ్దిదారులకు దళితబంధు చెక్కులను అందజేశారు.