ఎమ్మెల్సీలుగా వైసిపి అభ్యర్థుల నామినేషన్‌ బి ఫామ్‌అందించి ఆశీర్వదించిన సిఎం

జగన్‌అమరావతి,నవంబర్‌16జనం సాక్షి

ఆంధ్రప్రదేశ్‌ లో ఎమ్మెల్యే కోటాలో వైసిపి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఎమ్మెల్సీగా నామినేషన్‌ వేసే ముందు తాడేపల్లి సిఎం నివాసంలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థి పాలవలస విక్రాంత్‌ మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సిఎం జగన్‌ నుంచి బీఫామ్స్‌ తీసుకున్న గోవిందరెడ్డి, విక్రాంత్‌ ఇషాఖ్‌ బాషా నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు. నామినేషన్‌ కార్యక్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి, ధర్మాన కృష్షదాస్‌, బొత్స సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సిఎం జగన్‌ ను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు కంబాల జోగులు, విశ్వాసరాయి కళావతి, విజయనగరం జడ్పీ చైర్మన్‌ చిన్న శీను, సీనియర్‌ నాయకులు పాలవలస రాజశేఖరంతో పాటు మరో ఏమెల్సీ అభ్యర్ధి ఇషాక్‌ అహ్మద్‌ తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యే కోటాలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన పాలవసల విక్రాంత్‌.. పాలవలస కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన మూడో తరం నాయకుడు. ఈయన తాత పాలవలస సంఘం నాయుడు, నాయనమ్మ రుక్ముణమ్మ ఉణుకూరు ఎమ్మెల్యేలుగా సేవలందించారు. తండ్రి రాజశేఖరం ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా, జెడ్పీ చైర్మన్‌గా సేవలందించారు. విక్రాంత్‌ డీసీసీబీ చైర్మన్‌గా పనిచేశారు. దేవసాని చిన్న గోవిందరెడ్డి 1988లో గ్రూపు1లో ఎంపికై రీజినల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌గా పనిచేశారు. డిప్యూటీ కమిషనర్‌ ట్రాన్స్‌పోర్ట్‌గా పదోన్నతి పొంది 2001లో రాజీనామా చేసి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రోద్బలంతో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2004లో బద్వేలు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్సార్‌ మరణానంతరం ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెలకొల్పిన వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆ పార్టీ తరఫున 2014లో జయరాములు, 2019లో డాక్టర్‌ వెంకట సుబ్బయ్యలను ఎమ్మెల్యేలుగా గెలిపించారు. వెంకటసుబ్బయ్య హఠాన్మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన భార్య డాక్టర్‌ సుధను 90వేలకు పైగా మెజారిటీతో గెలిపించడంలో కీలకపాత్ర పోషించారు. ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తించిన వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 2015లో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఆ పదవీ కాలం 2021 మే నెలలో ముగిసింది. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఇసాక్‌బాషా మైనార్టీ వర్గ నేతగా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. 2018లో వైఎస్సార్‌సీపీ నంద్యాల పట్టణ శాఖ అధ్యక్షుడిగా పని చేసిన ఆయన ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా, నంద్యాల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు.గతంలో వైఎస్సార్‌సీపీ నంద్యాల పట్టణ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే నంద్యాల మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌గా పనిచేస్తున్నారు.