ఎమ్మెల్సీ తన వైఖరి స్పష్టం చేయాలి
కాశిపేట గ్రామీణం: కేకే2 ఓపెన్‌కాస్ట్‌పై ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు తన వైఖరిని స్పష్టం చేయాలని మండల భూనిర్వాసిత ఫోరం సభ్యులు ఒక సమావేశంలో డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు వర్గీయులు ఎవరూ ఉద్యమంలో పాల్గొనడం లేదని, సింగరేణి యాజమాన్యంతో ముందస్తు ఒప్పందాలు వల్లే ఈ ఉద్యమానికి వ్యతిరేక పోరాటంలో ముందుకు రావడం లేదని వారు ఆరోపించారు. ప్రజలకు మద్దతుగా తక్షణమే ఉద్యమంలో పాల్గొని వారి సహాయ సహకారాలను అందించాలని కోరారు.



