ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ సహాయంతో ఎల్ఈడి ప్రారంభం :మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్.
దౌల్తాబాద్ సెప్టెంబర్ 23, జనం సాక్షి.
దౌల్తాబాద్ మండల కేంద్రంలో బతుకమ్మ పండుగ సందర్భంగా ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ సహాయంతో దౌల్తాబాదులో రాందాస్ చెరువు రోడ్డుకు ఇరువైపులా ఎల్ఈడి బల్బులు శుక్రవారం మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్ ప్రారంభించారు. అనంతరం మాజీ సర్పంచి మాట్లాడుతూ ఉచితంగా ఎల్ఈడి బల్బులు అందించిన ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ముత్యం గారి యాదగిరి,వార్డు మెంబర్ మాశెట్టి నరేష్ గుప్తా, ఏఎంసి డైరెక్టర్ కేంసారపు నాగరాజు, గ్రామపంచాయతీ కోఆప్షన్ సభ్యులు షాదుల్లా,గ్రామస్తులు సత్తయ్య, శ్రీనివాసు , తదితరులు పాల్గొన్నారు.