ఎయిడ్స్‌పై అవగాహన కల్పించుకోవాలి
మెదక్, డిసెంబర్ 1 : ఎయిడ్స్ అవగాహన కల్పించుకొని ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పాటు చేసే విధంగా యువత ముందుకు సాగాలని జిల్లా రెవెన్యూ అధికారి ప్రకాశ్‌కుమార్ అన్నారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి, జిల్లా యువజన సంక్షేమ శాఖ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువత రేపటి పౌరులని, యువత ఆరోగ్యంగా ఉంటే దేశం కూడా ఆరోగ్యంగా ఉంటుందని, ఆరోగ్యమే మహాభాగ్యంగా భావించి ఆరోగ్యకరమైన సమాజం కోసం కృషి చేయాలన్నారు. సమాజంలో ఉన్న కొన్ని బలహీనతలను యువత ఫ్యాషన్‌గా భావించి చేడు మార్గాన పడుతున్నారని, చేడు మార్గంలో వెళ్లడం ద్వారా యువత ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ఎయిడ్స్ మందులేదని, దీనిపై అవగాహన కల్పించుకొని ఎయిడ్స్ రాకుండా చూసుకోవాలని ఆయన సూచించారు.