ఎయిడ్స్‌పై ఫలితాలిస్తున్న ప్రచారం

యువతలో పెరుగుతన్న అవగాహన

విజయవాడ,జూన్‌22(హో): ప్రభుత్వం చేపడుతున్న చర్యల కారణంగా గతంతో పోలిస్తే ఎయిడ్స్‌వ్యాధి వ్యాప్తి తగ్గిందని అధికారులు అన్నారు. ప్రధానంగా యువతలో మార్పు వస్తోందని విశ్లేషించారు. యువత పెడదారిలో పడకుండా, ప్రతి ఒక్కరికి ఎయిడ్స్‌ పై అవగాహన కలిగించడం వల్ల మార్పు సాధ్యమయ్యిందని అంటున్నారు. యువత సమసమాజ నిర్మాణాకి పాటుపడాలని, పెడదారిలో పడకుండా మంచి మార్గాలను ఎంచుకొని ముందుకు సాగాలన్నారు. అయితే ప్రస్తుతం ఎయిడ్స్‌ గణనియమై శాతం తగ్గిందని ఇందుకు ఎయిడ్స్‌ నియత్రణ సంస్థ కృషి ఎంతో వుంద అన్నారు. ఈ విషయన్ని ప్రతి ఒక్కరు గమంచి ఎయిడ్స్‌ నిర్మూలకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎయిడ్స్‌ వ్యాధి ఇతర రాష్ట్రాల నుండి మన రాష్ట్రాకి వచ్చిందని లారీ డ్రైవర్ల కుటుంబాక దూరంగా వుండి అదుకోకుండా ఎయిడ్స్‌ బారిన పడి వారి కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకొంటున్నారని వారు ఎయిడ్స్‌పై అవగాహన పొందాలన్నారు. ఈ విషయంపై విస్తృత ప్రచారం గావించి అందులో అవగాహన కల్పించాలని ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. తెలిసీ తెలియక ఎయిడ్స్‌ బారిన పడి వారి ఆదరించి, గౌరవించాలని, ప్రభుత్వం కూడా వారికి ఎన్నో సంక్షేమ పథకాలను వర్తింపజేసింద అన్నారు. యువత ఎయిడ్స్‌ భారిన పడకుండా ఎయిడ్స్‌పైఅవగాహన పొందాలని, మరో కారణంగా ఎయిడ్స్‌ బారిన పడి వారు, ఇతరులు ఎయిడ్స్‌ బారిన పడకుండా ప్రభుత్వఅవగాహన కార్యక్రమంలో పాల్గొని ఎయిడ్స్‌ వ్యాధి నిర్మూల చర్యలు తీసుకొనుటకు సహకరించాల అన్నారు.అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఎయిడ్స్‌పై అవగాహన పొంది ఈ వ్యాధి నిర్మూల చేస్తున్నారని అన్నారు. మనదేశంలో కూడా ఎయిడ్స్‌పై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి నిర్మూలిస్తున్నారని అందుకు ఎయిడ్స్‌ నియత్రణా సంస్థ కృషి చేస్తున్నదని అన్నారు. ప్రతి ఒక్కరూ ఎయిడ్స్‌పై అవగాహన కలిగి వుండాలని వైద్యాధికారులు అన్నారు. ఎయిడ్స్‌ వంటి అంటువ్యాధులకు దూరంగా ఆరోగ్య రక్షణలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ట్రక్కు డ్రైవర్లు, కుటుంబంతో దూరంగా వుండేవారు, కొంత మంది కుటుంబాకి దూరంగా వుండి ఈ ఎయిడ్స్‌ మహమ్మారికి గురి అవుతున్నార తెలిపారు.