ఎయిమ్స్‌ లైట్‌హౌజ్‌ లాంటిది

ప్రజల్లో ఉన్న ప్రతిష్ట అపారం
అందుకే అన్ని రాష్టాల్రు ఎయిమ్స్‌ కోసం పట్టు
ఎయిమ్స్‌ వ్యవస్థాపక దినోత్సవంలో మాండవీయ
న్యూఢల్లీి,సెప్టెంబర్‌25 (జనంసాక్షి);  ఆరోగ్య రంగంలో ఎయిమ్స్‌ లైట్‌హౌజ్‌ లాంటిదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్‌ మాండవీయ తెలిపారు. ప్రజలకు ఎయిమ్స్‌ పట్ల నమ్మకం ఉందన్నారు. ఎయిమ్స్‌ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఢల్లీి ఎయిమ్స్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్‌ మాండవీయ పాల్గొన్నారు. అందుకే అన్ని రాష్టాల్రు ఎయిమ్స్‌ వైద్యశాలల కోసం పోటీ పడుతున్నాయన్నారు. దేశవ్యాప్తంగా కొత్తగా 22 ఎయిమ్స్‌ వైద్యశాలలను ఓపెన్‌ చేయనున్నట్లు మంత్రి మాండవీయ వెల్లడిరచారు. ఆరోగ్యరంగాన్ని, అభివృద్ధిని తమ ప్రభుత్వం ఏకం చేసిందని, హెల్తీ ఇండియా విజన్‌తో ప్రధాని మోదీ పనిచేస్తున్నారని, హెల్త్‌ బ్జడెట్‌ను 2.40 లక్షల కోట్లకు పెంచినట్లు మంత్రి తెలిపారు.
దేశంలో ఆరోగ్యం, అభివృద్ధి రెండిరటినీ కలిపి ముందుకు తీసుకువెళ్లే సంప్రదాయం లేదని, అయితే ఆ పని ప్రధానమంత్రి మోదీ చేశారని మంత్రి మన్షుక్‌ మాండవీయ ప్రశంసించారు. ప్రధాని మోదీ నాయకత్వం లో దేశ ఆరోగ్య బడ్జెట్‌ రూ.2.40 లక్షల కోట్లకు పెంచారని అన్నారు. ’ఆరోగ్యకర భారతం’ కలలు సాకారం చేయాలనే తపనతో మోదీ ఈ పని చేశారని అన్నారు. హెల్త్‌ సెక్టార్‌లో ఎయిమ్స్‌ ఒక ’లైట్‌హైస్‌’ అని
మంత్రి కొనియాడారు. ప్రజలకు ఎయిమ్స్‌పై ఎంతో నమ్మకం ఉందని, పెరుగుతున్న డిమాండ్లకు అనుగుణంగా 22 ఎయిమ్స్‌ల ఇనాగరేషన్‌ వర్క్‌ ఈరోజు జరుగుతోందని చెప్పారు. ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ గులేరియా మాట్లాడుతూ, కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ వచ్చినట్లయితే దానికి ఎదుర్కొనేందుకు అవసరమైన శిక్షణ, కెపాసిటీ బిల్టింగ్‌లో కూడా తాము ముందున్నామని చెప్పారు. గత మూడేళ్లలో సాధించిన ప్రగతిని కొనసాగిస్తూ దేశంలోనే నెంబర్‌ వన్‌ మెడికల్‌ కాలేజీ ర్యాంక్‌ను ఎయిమ్స్‌ నిలబెట్టుకుందని చెప్పారు.
ఒకవేళ కోవిడ్‌ థార్డ్‌ వేవ్‌ వస్తే, దాన్ని ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నట్లు ఎయిమ్స్‌ డైరక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి భారతి ప్రవీణ్‌ కూడా పాల్గొన్నారు.