ఎయిర్ బస్సెక్కి ఎడారి
దేశంలో దిగినప్పుడు ఆకళ్లలో ఎన్నో ‘కలల’ కాంతులు…! ఎలాగోలా నాలుగు రాళ్లు సంపాయించి సంతోషంతో స్వగ్రామం చేరుతామనే సజీవ ఆశలు…! కానీ అంతలోనే అక్కడి ఎడారిలో మిగిలిన ఇసుక రేణువుల్లాగే ఆశలన్నీ ఆవిరయ్యాయి…! కలలన్నీ కల్లలయ్యాయి…! సంపాదన సంగతి దేవుడెరుగు, ప్రాణాలతో స్వదేశం తిరిగిరావడం ఎట్లా అన్నది ఇప్పుడా వలస జీవులకు అంతుచిక్కని ప్రశ్న…! జవాబు చెప్పాల్సిన ఎంబసీ కార్యాలయం సమాధిలా నిల్చుంటే, దేశంకాని దేశంలో ఆ అభాగ్యులు ‘ఓ’ అంట ఒర్రుతాండ్రు. వినేవారెవరు?