ఎరువులకోసం ఎంచికల్‌పేట గ్రామాస్థుల ఆందోళన

ఎల్కతుర్తి: మండలంలోని ఎంచికల్‌పేట్‌ గ్రామానికి చెందిన సుమారు వంద మంది రైతులు ఈ రోజు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. శుక్రవారం సహకార సంఘం ఆధ్వర్యంలో 200యూరియా బస్తాలు పంపిస్తామని చెప్పటంతో స్థానిక గ్రామ సచివాలయం వద్ద వరుసలో నిలబడ్డారు. మధ్యాహ్నమైనా యూరియా బస్తాలు రాకపోవటంతో నిరాశ చెందిన రైతులు ఆందోళన చేశారు. యూరియాను వెంటనే సరఫరా చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు.