ఎరువుల కోసం బారులు తీరిన రైతులు
కోహేడ: తెల్లవారి లేస్తే పోళంలోకి వెళ్లి పనుల్లో నిమగ్నమయ్యే రైతులు నేడు ఎరువుల కోసం రోడ్లేక్కారు. అసలే కరెంట్ కష్టాలతో అల్లడుతున్న రైతన్న ఎరువుల కోసం ఆశగా ఎదురుచుస్తున్నారు అయినా అందనే ద్రాక్షే మండలంలోని సహకార సంఘం వద్ద మంగళవారం తెల్లవారుజాము నుంచి రైతులు ఎరువుల కోసంబారులు తీరారు. రైతులకు సరఫరా చేసేందుకు సహకార సంఘానికి 800 బస్తాల ఎరువుల వచ్చాయి. అయితే ఎరువులు పంపీణీ చేయడానికి వ్యవసాయాధికారులు రాకపోవడంతో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.