ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రి తరలింపుపై హైకోర్టులో నాగం పిల్‌

 హైద‌రాబాద్ జ‌నంసాక్షి: హైదరాబాద్‌ ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రి తరలింపు నిర్ణయాన్ని సవాలు చేస్తూ భాజపా నాయకుడు నాగం జనార్ధన్‌రెడ్డి ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టులో దాఖలు చేశారు. సి.ఎం. కేసీఆర్‌ పేద రోగులకు ఇబ్బందులు కలిగించేలా వ్యవహరిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అత్యవసర సమయాల్లో హైదరాబాద్‌కు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న వికారాబాద్‌కు రోగులు ఎలా వెళతారని ఆయన ప్రశ్నించారు.