ఎర్రచందనం అక్రమ రవాణాదారుల అరెస్ట్‌

 

తిరుపతి: చిత్తూరు జిల్లా పలమనేరులో ఈ రోజు అటవీశాఖ అధికారులు 30మంది ఎర్రచందనం అక్రమ రవాణాదారులను అరెస్ట్‌ చేశారు. తమిళనాడు నుంచి శేషాచలం అడవులకు వెళ్తుండగా నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు అటవీశాఖాధికారులు తెలిపారు.